

మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ మార్చి 09 :- నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని ప్రసిద్ధిగాంచిన అడెల్లి మహా పోచమ్మ ఆలయాన్ని మాజీ ఎంపీ సోయం బాపూరావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవి ఆశీస్సులతో ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నానన్నారు. ఎంపీ వెంట ఆదివాసీ కాంగ్రెస్ జిల్లా చేర్మెన్ సేద్మకి ఆనంద్ రావు ఉన్నారు.