

అడిషనల్ కలెక్టర్ కి సేవాలాల్ మహారాజ్ ఆలయ ప్రారంభోత్సవ ఆహ్వానం
మనోరంజని న్యూస్, మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గం ప్రతినిధి.
మంచిర్యాల జిల్లా, భీమారం మండల కేంద్రంలో ని బూరుగుపల్లి గ్రామంలో నూతనంగా ప్రారంభిస్తున్న సేవాలాల్ మహారాజ్ ఆలయ ప్రారంభోత్సవం, మరియు విగ్రహ ప్రతిష్టాపన కొరకు రావలసిందిగా మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ మోతిలాల్ నాయక్ ని బూరుగుపల్లి గ్రామస్తులు ఆహ్వానించారు. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ భుక్య రాజ్ కుమార్ నాయక్ ఆధ్వర్యంలో సేవాలాల్ స్వాములు కలెక్టర్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. దానికి ఆయన సానుకూలంగా స్పందించారు అని, ఏప్రిల్ 4వ తేదీన జరిగే విగ్రహ ప్రతిష్ట పూజా కార్యక్రమంలో సతీ సమేతంగా పాల్గొంటారని భూక్యా రాజ్ కుమార్ నాయక్ తెలిపారు.