

మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ మార్చి 21 – నిర్మల్ జిల్లా -సారంగాపూర్:అడవులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నదని అటవీ క్షేత్రఅధికారులు సప్న,వెన్నెల,సుజాతలు అన్నారు.ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం మండలంలోని స్వర్ణ అరశ్రమ పాఠశాల విద్యార్థులకు, ఆడేల్లి గ్రామ ఉపాధి హామీ కూలీలకు అడవులు వాటి ప్రాముఖ్యత పై అవగాహన కల్పించారు. మానవాళి మనుగడకు అడవులు జీవనాధారం. అడవులకు నిప్పు వల్ల కల్గు దుష్పరిణామాలు గురించి వివరించారు. ఈ కార్యక్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంగీత రాణి ,వార్డెన్ రాథోడ్ మంగేలాల్, విద్యార్థులు ,ఉపాధి,అటవీ సిబ్బంది కూలీలు పాల్గొన్నారు.
