

అటవీ ప్రాంతం లో ఇన్వెంటరీ సర్వే.
మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ మార్చి 13 – నిర్మల్ జిల్లా -సారంగాపూర్ మండలంలోని కౌట్ల(బి) అటవీ ప్రాంతంలో గురువారం ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా. బెంగళూరు అసిస్టెంట్ డైరెక్టర్ సమత్ సర్వే నిర్వహించారు. మొక్కల పెరుగుదల, అటవీ అభివృద్ధి, గడ్డి జాతుల పెరుగుదల, వివిధ అటవీ సంబంధ అభివృద్ధి అంశాల పైన ఇన్వెంటరీ సర్వేను నిర్వహించారు. నిర్ధిష్ట ప్రాంతం భౌతిక అంశాలు ఆస్తుల స్థితి జాబితా అంచనా ప్రాజెక్టు ను చేయడం కోసం అటవీ సిబ్బందితో కలసి సర్వే చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎఫ్ఆర్ఓ నజీర్ ఖాన్, ఎఫ్ బి ఓ స్వప్న లు పాల్గొన్నారు.

