

అంధులను కోర్టుల చుట్టూ తిప్పించడంపై హైకోర్టు జడ్జి ఆగ్రహం
తెలంగాణ దివ్యాంగుల శాఖ అధికారుల తీరుపై హైకోర్టు జడ్జి జస్టిస్ నగేష్ భీమపాక తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అంధులను కోర్టుల చుట్టూ తిప్పించడంపై ఆగ్రహించారు. కొందరు అధికారులే నిజమైన అంధులని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అన్యాయంగా ఉద్యోగాల నుంచి తొలగించారని కొందరు అంధ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించగా.. సోమవారం విచారణ జరిగింది. వేర్వేరు కారణాలతో తొలగించడంపై 8 ఏళ్లుగా వారు న్యాయపోరాటం చేయడం గమనార్హం