

అందాల పోటీలకు సిద్ధమవుతున్న హైదరాబాద్
మనోరంజని ప్రతినిధి హైదరాబాద్ మార్చి 25 – భాగ్య నగరం మిస్ వరల్డ్ పోటీలకు సిద్ధమవుతోంది. మే 10న గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభోత్సవ కార్యక్రమంతోపాటు 31న ఫైనల్స్ జరుగుతాయి. పోటీదారులు 4 బృందాలుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో పర్యటిస్తారు. ఈ పోటీలలో విజేత జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు గవర్నర్, సీఎంలను మర్యాదపూర్వకంగా కలుస్తారు. 120 దేశాలకు చెందిన ప్రతినిధులు పోటీలలో పాల్గొననున్నారు.