

అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున దారుణం..
ముమ్మిడివరం మండలం అనాతవరంలో తన పొరుగింటి మహిళను కత్తితో నరికిన వ్యక్తి…
గతంనుండి ఇద్దరిమద్య ఇంటి సరిహద్దు వివాదం నడుస్తుండగా ఈరోజు ఆ వివాదం మరింత రాజుకొంది..
ఆగ్రహంతో తన పొరుగింటి వివాహిత చేట్ల మాలతిని కత్తితో నరికిన పంతగంటి జయ రామకృష్ణ..
తీవ్రంగా గాయపడిన మాలతిని అమలాపురంలో ఆసుపత్రికి తరలించగా, నిందితుడు పోలీసులకు లొంగిపోయినట్లుగా తెలియవస్తోంది…
సంఘటనా స్దలానికి చేరుకుని పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు..