అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల పోస్టర్ల ఆవిష్కరణ

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల పోస్టర్ల ఆవిష్కరణ

మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 04 :-తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు సంబంధించిన పోస్టర్లను మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లోని తన చాంబర్లో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హైదరాబాదులో నిర్వహిస్తున్న మహిళా దినోత్సవ వేడుకలకు జిల్లా నుంచి మహిళా అధికారులు ఉద్యోగులు పాల్గొనాలని కోరారు. టీ జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పి జి రెడ్డి మాట్లాడుతూ టీజీవో కేంద్ర సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో ఈనెల 6 తేదీ నుండి 8వ తేదీ వరకు హైదరాబాదులోని ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయ కళాశాల, దోమలగూడ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ వేడుకలకు రాష్ట్ర మహిళా మంత్రులు కొండా సురేఖ, సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి లు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని తెలిపారు. జిల్లా నుండి అధిక సంఖ్యలో మహిళా ఉద్యోగులు, అధికారులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా కార్యదర్శి ధాత్రిక రమేష్, అసోసియేట్ ప్రేసిడెంట్ ప్రవీణ్ కుమార్, జిల్లా మహిళా విభాగ బాధ్యులు గోదావరి, డాక్టరు రాణి, కరుణశ్రీ, దేవొల్ల లత, ఉపాధ్యక్షులు శంకర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ రవి కుమార్, పబ్లిసిటీ సెక్రటరీ విష్ణు వర్ధన్ , ఆఫీసు సెక్రెటరీ క్రాంతి కుమార్, కార్యవర్గ సభ్యులు, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    సంస్కార్ స్కూల్ డే-పోసిటివ్ పేరెంటింగ్ సెమినార్ విజయవంతం

    సంస్కార్ స్కూల్ డే-పోసిటివ్ పేరెంటింగ్ సెమినార్ విజయవంతం మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 15 :- భైంసా పట్టణంలోని బృందావన్ గార్డెన్స్‌లో సంస్కార్ స్కూల్ డే మరియు పోసిటివ్ పేరెంటింగ్ సెమినార్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముదోల్ ఎమ్మెల్యే పవార్…

    షాపూర్ క్షత్రియ పట్టుకరి సమాజ్ ఆధ్వర్యంలో ముంజు బంధంన్

    షాపూర్ క్షత్రియ పట్టుకరి సమాజ్ ఆధ్వర్యంలో ముంజు బంధంన్ మనోరంజని ప్రతినిధి ఆర్ముర్ మార్చి 15 ఏస్ ఎస్ కే క్షత్రియ సమాజ్ (పట్కరి) షాపూర్ నగర్ లో పిల్లలకు ఉపనయనం (ముంజు బంధంన్) కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీనికి షాపూర్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, LED, LCD టెలివిజన్ల ధరలు తగ్గే అవకాశం

    ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, LED, LCD టెలివిజన్ల ధరలు తగ్గే అవకాశం

    ఆ పథకానికి వయోపరిమితి 60 ఏళ్లకు తగ్గింపు!

    ఆ పథకానికి వయోపరిమితి 60 ఏళ్లకు తగ్గింపు!

    శ్రీశైలం దేవస్థానం పేరుతో నకిలీ వెబ్‌సైట్.. మోసపోయిన భక్తులు

    శ్రీశైలం దేవస్థానం పేరుతో నకిలీ వెబ్‌సైట్.. మోసపోయిన భక్తులు

    సంస్కార్ స్కూల్ డే-పోసిటివ్ పేరెంటింగ్ సెమినార్ విజయవంతం

    సంస్కార్ స్కూల్ డే-పోసిటివ్ పేరెంటింగ్ సెమినార్ విజయవంతం