

అంతరిక్ష ప్రయోగాల ద్వారా ఇస్రోకి రూ 1,243 కోట్ల ఆదాయం
విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడం ద్వారా ఇస్రో రూ.1,243 కోట్లు ఆర్జించినట్లు కేంద్రమంత్రి జితేంద్రసింగ్ వెల్లడించారు. భారత్ పంపిన ఉపగ్రహాల్లో అత్యధికంగా అమెరికా(232), ఇంగ్లండ్ (83), సింగపూర్ (19) దేశాలకు చెందినవి ఉన్నాయి. మొత్తంగా 393 విదేశీ ఉపగ్రహాలు, 3కస్టమర్ ఉపగ్రహాలను ప్రయోగించినట్లు తెలిపారు. ప్రస్తుతం 61 దేశాలు, 5 బహుళజాతి సంస్థల తో ఇస్రో ఒప్పందాలు చేసుకుంది