

అంగన్వాడీ కేంద్రంలో ముందస్తు ఉగాది పండుగ వేడుకలు.
*మనోరంజని మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి మార్చి 29 :- మంచిర్యాల జిల్లా, భీమారం మండల కేంద్రంలోని అంగన్వాడి కేంద్రంలో ముందస్తు ఉగాది పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా అంగన్వాడి కేంద్రాన్ని ముగ్గులు పులు పండ్లతో అలంకరించారు. స్కూల్ లో ఉగాది పచ్చడిని తయారు చేసి పిల్లల అందరికి పంచుతూ సంతోషంగా ముందస్తు ఉగాది వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ స్వప్న, ఆయా మరియు పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు