హైదరాబాద్ నగరంలో కాల్పుల కలకలం

హైదరాబాద్ నగరంలో కాల్పుల కలకలం

మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 29 – హైదరాబాద్ నగరం గుడి మల్కాపూర్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి, గుడిమల్కాపూర్ లోని కింగ్స్ ప్యాలెస్‌లో ఆనం మీర్జా ఎక్స్పో జరుగుతు న్న , ప్రదర్శనలో ఇద్దరు దుకాణదారుల మధ్య వాగ్వాదం జరిగింది, ఈ క్రమంలోనే వారిలో ఒక దుకాణదారుడు గాలిలో కాల్పులు జరపడంతో అక్కడున్న వారిలో భయాందోళనకు గురయ్యారు. కాల్పుల శబ్దంతో సందడి నెలకొనగా, ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు గాలిలో కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ఎక్స్పో నిర్వాహకులు, ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో ఎక్స్పో ప్రాంతంలో భద్రతను పెంచినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ సంఘటనతో ఎక్స్పోకు వచ్చిన ప్రజల్లో ఆందోళన నెలకొంది. అయితే, పోలీసులు వెంటనే స్పందించడంతో పరిస్ధితి అదుపులోకి వచ్చిందని అక్కడి స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై ఇంకా వివరాలు అందుబాటులోకి రావాల్సి ఉంది

  • Related Posts

    గుర్తుతెలియని వాహనం ఢీకొని మృతి

    గుర్తుతెలియని వాహనం ఢీకొని మృతి మనోరంజని ప్రతినిధి భైంసా ఏప్రిల్ 10 :- నిర్మల్ జిల్లా భైంసా: మండలంలోని వానల్పాడు గ్రామ సమీపంలో గురువారం గుర్తు తెలియనివానం ఢీకొని రాజు (32) అనే వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై శంకర్ తెలిపారు.…

    ముంబై ఉగ్రదాడి నిందితుడికి అత్యున్నత స్థాయి భద్రత, బుల్లెట్ ప్రూఫ్ వాహనం..!!

    ముంబై ఉగ్రదాడి నిందితుడికి అత్యున్నత స్థాయి భద్రత, బుల్లెట్ ప్రూఫ్ వాహనం..!! అమెరికా అప్పగించిన 26/11 ముంబై ఉగ్రవాద దాడి నిందితుడు తహవూర్ రాణా రాకకు ముందు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. పాకిస్తాన్ సంతతికి చెందిన కెనడా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    వెంకటేశ్వర ఎస్సీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 25 కిలోల బియ్యం అందజేత

    వెంకటేశ్వర ఎస్సీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 25 కిలోల బియ్యం అందజేత

    లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేసి సాగునీరు తాగునీరు అందించాలి.

    లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేసి సాగునీరు తాగునీరు అందించాలి.

    ఆలయాల నిర్మాణానికి ప్రభుత్వ ఆమోదం

    ఆలయాల నిర్మాణానికి ప్రభుత్వ ఆమోదం

    చుక్కాపూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం

    చుక్కాపూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం