

ఎస్విఈపి సిఆర్పిలకు వ్రాత పరీక్ష ప్రాజెక్ట్ పరీక్షలను నిర్వహించిన ఎస్వీఈపి సేర్ప్ ప్రాజెక్ట్ మేనేజర్ శ్రావణ్ కుమార్ డిపిఎం శేష రావు.
మనోరంజని ప్రతినిధి ఆదిలాబాద్ మార్చి 12 :- ఆదిలాబాద్ జిల్లా బోథ్ బ్లాక్ పరిధిలోని బోథ్. బజార్హత్నూర్. నేరడిగొండ. మండలాల్లో నూతనంగా ప్రారంభించనున్న ఎస్వీఈపి. స్టార్ట్ ప్ విలేజ్ ఎంటర్ ప్రెన్యునూర్ షిప్ ప్రోగ్రాం ప్రోగ్రాం (svep) ప్రారంభించబోతున్న తరుణంలో బుధవారం బోథ్ మండల కేంద్రంలోని మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో సిఆర్పిలుగా పనిచేయడానికి దరఖాస్తు చేసుకున్న సంఘంలోని మహిళా సంఘ సభ్యులకు సెర్ప్ ప్రాజెక్ట్ మేనేజర్ శ్రావణ్ కుమార్. డి ఆర్ డి ఏ ప్రాజెక్ట్ మేనేజర్ శేషరావు కలిసి పిఆర్పి గా పనిచేయడానికి వచ్చిన సంఘలోని మహిళలకు వ్రాత ప్రాజెక్టు పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ మేనేజర్ డిపిఎం శేష రావు మాట్లాడుతూ. ఎస్ వి ఈ పి అనేది దీన్ దయాల్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవన ఉపాధి మిషిన్ డే ఎన్ ఆర్ ఎల్ ఎం ఉప పథకమని. గ్రామీణ యువత వ్యాపారాలు ప్రారంభించడంలో పేదరికం నిరుద్యోగాన్ని తగ్గించడంలో సహాయపడటమే ఎస్ వి ఈ పి యొక్క ముఖ్య లక్ష్యమని అన్నారు. ఎస్ వి ఈ పి పనిచేసే విధానం గురించి మాట్లాడుతూ. వ్యవసాయతర రంగంలో స్వయం సహాయక బృందాలు సంఘాలు వారి కుటుంబాల చిన్న వ్యాపారాలను ప్రారంభించడానికి ఎస్వీవిపి సహాయం చేస్తుంది. ఎస్ వి వి పి వస్థాపకులకు ఆర్థిక సహాయం వ్యాపార సహాయాలు సేవల సమాచారాన్ని అందిస్తుందని. ఎస్విఈపి ప్రాజెక్టులను నాలుగు సంవత్సరాల కాలంలో బ్లాక్ లలో అమలు చేస్తారు. ఎస్విఈపి ప్రయోజనాలు. గ్రామీణ యువతకు ఉద్యోగాలు కల్పించడం ద్వారా స్థానిక అభివృద్ధిని ఎస్వీవిపి ప్రోత్సహిస్తుంది. గ్రామీణ పేద కుటుంబాల వ్యాపారాలు ప్రారంభించడంలో సహాయపడటం ద్వారా పేదరికం నుండి బయటపడడానికి ఎస్ వి ఈ పి సహాయపడుతుంది. సంస్థలు స్థిరంగా మారే వరకు వరకు వాటికి మద్దతు ఇస్తుంది అని అన్నారు. అంతకుముందు సిఆర్పిలుగా పని చేయడానికి వచ్చిన సంఘంలోని మహిళా సభ్యులకు వ్రాత ప్రాజెక్టు పరీక్షలు నిర్వహించి వారి చేత ఒక బ్రిడ్జి నిర్మాణం చేయించారు ఈ ఇంటర్వ్యూ కార్యక్రమంలో డిపిఎం శేష రావు. బోథ్ ఎమ్మెస్ అధ్యక్షురాలు తోడిశెట్టి ప్రేమల బోథ్ ఏపీఎం మాధవ బోథ్ బ్లాక్ ఏపీఎం మాధవి ఉట్నూర్ బ్లాక్ ఏపీఎం శ్రీకాంత్ స్త్రినిది ఆర్ యం పూర్ణచందర్. బజార్హత్నూర్ ఏపీఎం పవర్ గణేష్ బోథ్ మండల సీసీలు బోథ్. బజార్హత్నూర్. నేరడిగొండ మండలాల నుంచి వచ్చిన సి ఆర్ పి ఎస్ లు బోథ్ ఎమ్మెస్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
