సూర్యాపేట మిర్చి యార్డులో ప్రెస్ క్లబ్ భవనాన్ని నిర్మించాలి

సూర్యాపేట మిర్చి యార్డులో ప్రెస్ క్లబ్ భవనాన్ని నిర్మించాలి

శుక్రవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందించిన…టిఎస్ జేఏ నాయకులు

అసోసియేషన్ సభ్యులకు కార్డులు పంపిణీ చేసి మాట్లాడిన…రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి

సూర్యాపేట జిల్లా కేంద్రంలో గల పాత మిర్చి యార్డులో అన్ని సౌకర్యాలతో కూడిన పక్క జర్నలిస్టు భవనాన్ని నిర్మించాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ నాయకులు శుక్రవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవర్ కు వినతి పత్రాన్ని అందించారు. అనంతరం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి కమిటీ సభ్యులకు కార్డులు పంపిణీ చేసి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు అన్ని జిల్లా కలెక్టర్ లకు ఆర్డిఓ లకు అంబేద్కర్ విగ్రహాలకు గాంధీ విగ్రహాలకు తెలంగాణ తల్లి విగ్రహాలకు వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం చేపట్టామని తెలిపారు.ముఖ్యంగా జర్నలిస్టులు ప్రెస్ క్లబ్ భవనాలు లేక చెట్ల కింద టీ స్టాలలో హోటలలో ప్రైవేట్ భవనాల కింద గడపాల్సిన దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు.అదేవిధంగా వర్కింగ్ లో ఉన్న ప్రతి ఒక్క జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డులు,హెల్త్ కార్డులు, పోలీసు భరోసా కార్డులు,ఇంటి స్థలాలు లేదా పక్క ఇంటి నిర్మాణాలు చేపట్టి ఇవ్వాలని యాదగిరి డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించేంతవరకు పోరాటం కొనసాగిస్తామని అని యూనియన్ లతో కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సోషల్ మీడియా ఇన్ఛార్జి ధూపాటి శ్యాంబాబు, రాష్ట్ర కోశాధికారి కొరివి సతీష్ యాదవ్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ దుర్గం బాలు, సూర్యాపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మామిడి రవి, సూర్యాపేట జిల్లా సహాయ కార్యదర్శి తిరుపతి శ్రీనివాస్ సూర్యాపేట జిల్లా కోశాధికారి లంకె పల్లి రమేష్ పెన్ పహాడ్ మండల అధ్యక్షుడు పడిశాల నాగయ్య తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    రౌడీ షీట్ ఓపెన్ చేస్తే చెల్లదు.. రౌడీ షీట్ కు చట్టబద్దత లేదు”

    “రౌడీ షీట్ ఓపెన్ చేస్తే చెల్లదు.. రౌడీ షీట్ కు చట్టబద్దత లేదు” సుప్రీం కోర్ట్, హై కోర్టుల సంచలన తీర్పులు న్యూ ఢిల్లీ : సమాజం లో మనం చాలా సందర్భాల్లో ముఖ్యంగా పోలీస్ వ్యవస్థలో, కోర్టుల్లో, పలు కేసుల్లో,…

    ఎమ్మెల్యే నివాసంలో మిన్నంటిన హోలీ సంబరాలు

    ఎమ్మెల్యే నివాసంలో మిన్నంటిన హోలీ సంబరాలుహోలీ పండుగ సందర్భంగా భైంసా లోని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ నివాసంలో హోలీ సంబరాలు మిన్నంటాయి. బ్యాండ్ మేళాలతో పలువురు కార్యకర్తలు, నాయకులు నియోజకవర్గం లోని ఆయా గ్రామాల నుండి వచ్చి ఎమ్మెల్యే కు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మసీదులు, ఆలయాల్లో లౌడ్‌ స్పీకర్లపై ఆంక్షలు: యూ

    మసీదులు, ఆలయాల్లో లౌడ్‌ స్పీకర్లపై ఆంక్షలు: యూ

    రౌడీ షీట్ ఓపెన్ చేస్తే చెల్లదు.. రౌడీ షీట్ కు చట్టబద్దత లేదు”

    రౌడీ షీట్ ఓపెన్ చేస్తే చెల్లదు.. రౌడీ షీట్ కు చట్టబద్దత లేదు”

    రళలో అధిక స్థాయిలో అతినీలలోహిత కిరణాలు(UV Rays)

    రళలో అధిక స్థాయిలో అతినీలలోహిత కిరణాలు(UV Rays)

    ఎమ్మెల్యే నివాసంలో మిన్నంటిన హోలీ సంబరాలు

    ఎమ్మెల్యే నివాసంలో మిన్నంటిన హోలీ సంబరాలు