

సీఐ అంజూ అరెస్టుకు ఆదేశం
ఏపీ : శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ పై జాతీయ మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళను బహిరంగంగా లాగి దాడి చేయడంపై టీడీపీ నేత అనిత ఫిర్యాదుతో స్పందించిన కమిషన్.. వెంటనే అంజూపై FIR నమోదు చేసి అరెస్టు చేయాలని ఏపీ డీజీపీ ని ఆదేశించింది. కాగా బాధితురాలు మర్యాదపూర్వకంగా మాట్లాడలేదని, తాను ఆమెను కొట్టలేదని అంజూ ఇప్పటికే వివరణ ఇచ్చారు