శ్రీశైలం దేవస్థానం పేరుతో నకిలీ వెబ్‌సైట్.. మోసపోయిన భక్తులు

శ్రీశైలం దేవస్థానం పేరుతో నకిలీ వెబ్‌సైట్.. మోసపోయిన భక్తులు

మనోరంజని ప్రతినిధి మార్చి 15 :- శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోవడానికి నిత్యం వందల మంది భక్తులు వస్తుంటారు. ఈ క్రమంలో భక్తి శ్రద్ధలతో స్వామి వారికి మొక్కులు చెల్లించుకుంటారు. శ్రీశైలానికి వచ్చే భక్తులు వసతి కోసం శ్రీశైలం దేవస్థానం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శిస్తూ ఉంటారనే విషయం తెలిసిందే. అయితే శ్రీశైలం ఆలయంలో మరో తరహా మోసం వెలుగు చూసింది. కొంతమంది కేటుగాళ్లు శ్రీశైలం దేవస్థానం పేరుతో నకిలీ వెబ్‌సైట్ క్రియేట్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. ఈ తరుణంలో శ్రీశైలం ఆలయంలో వసతి కోసం దేవస్థానం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించే భక్తులను మోసం చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే.. కొంతమంది భక్తులు శ్రీశైలం ఆలయం లో వసతి కోసం ఈ నకిలీ వెబ్‌సైట్‌ను ఆశ్రయించారు. ఈ క్రమంలో వారు కొంత డబ్బులు కూడా చెల్లించారు. దీంతో దుండగులు చేసిన పనికి హైదరాబాద్, ముంబయి కి చెందిన భక్తులు మోసపోయారు. డబ్బులు చెల్లించిన తర్వాత.. శ్రీశైలానికి వచ్చిన అనంతరం జరిగిన మోసాన్ని భక్తులు గుర్తించారు. ఈ విషయన్ని శ్రీశైలం దేవస్థానం దృష్టికి తీసుకెళ్లడంతో నకిలీ వెబ్‌సైట్ వ్యవహారం గుట్టురట్టైంది. అయితే గతంలోనూ ఇలాంటి మోసాలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. దేవస్థానం అధికారులు ఈ మోసాలపై దృష్టి పెట్టాలని భక్తులు కోరుతున్నారు.

  • Related Posts

    తహసిల్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ పై దాడి

    తహసిల్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ పై దాడి ఆరుగురు పై కేసు నమోదు భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ మనోరంజని ప్రతినిధి తానుర్ మార్చి 17 :- నిర్మల్ జిల్లా తానూర్ తహసిల్దార్ కార్యాలయంలో విధులో నిర్వహిస్తున్న జూనియర్ అసిస్టెంట్ పై…

    ముగిసిన వట్టెం వెంకన్న స్వామి బ్రహ్మోత్సవాలు

    ముగిసిన వట్టెం వెంకన్న స్వామి బ్రహ్మోత్సవాలు మనోరంజని ప్రతినిధి నాగర్ కర్నూల్ మార్చి 17 ఈ నెల12వ తేది నుండి వారం రోజులపాటుగా వైభవంగా జరుగుతున్న వట్టెం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం నాడు పలు ప్రత్యేక…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్