

వేసవిలో రైతులకు సాగునీరు అందిస్తాం
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 11 :- వేసవిలో రైతులకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. మంగళవారం కడెం మండలం కొత్తమద్దిపడగ గ్రామ శివారు పంట పొలాలను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా రైతులు సాగు చేసిన పంటలకు సంబంధించి వివరాలను రైతులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. రైతులు సాగు చేసిన పంటలకు కడెం ప్రాజెక్టు సదర్మాట్ కాలువ ద్వారా చివరి ఆయకట్టు వరకు అవసరమైన మేరకు నీటిని అందిస్తామని తెలిపారు. సాగునీటి విషయంలో రైతులు ఎవరు ఆందోళన చెందనవసరం లేదన్నారు. ప్రతి పంట పొలానికి ఏప్రిల్ చివరినాటికీ సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజి ప్రసాద్, నీటిపారుదల శాఖ ఈఈ విట్టల్, తహసిల్దార్ ప్రభాకర్, ఎంపీడీవో అరుణ, అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు
