వేసవికి ముందుగా నీటి లీకేజ్ పనులు పూర్తి – మున్సిపల్ ఇంజనీర్

మనోరంజని ప్రతినిధి నిజామాబాద్ మార్చి ౦౩ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలో నీటి ఎద్దడి సమస్యను నివారించేందుకు నగరపాలక సంస్థ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో నగరంలోని రెండవ జోన్ పరిధిలోని ఆర్య సమాజ్ ప్రాంతంలో నీటి లీకేజ్ పనులను మున్సిపల్ ఇంజనీర్ మురళీకృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నగరపాలక సంస్థ కమిషనర్ ఆదేశాల మేరకు నగరంలో నీటి లీకేజ్ పనులను వేగంగా పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, నీటి సరఫరా సమర్థవంతంగా సాగేందుకు ఈ పనులు రెండు రోజుల్లో పూర్తవుతాయని పేర్కొన్నారు. ప్రజలు ఈ కార్యక్రమానికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ లీకేజ్ పనుల పర్యవేక్షణలో అసిస్టెంట్ ఇంజనీర్ ఇనాయత్ కరీం, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

  • Related Posts

    బీఆర్‌ఎస్‌ నాయకులు దళితుల పై చిన్నచూపు – డా. కూడెల్లి ప్రవీణ్ కుమార్

    బీఆర్‌ఎస్‌ నాయకులు దళితుల పై చిన్నచూపు – డా. కూడెల్లి ప్రవీణ్ కుమార్ మనోరంజని ప్రతినిధి హైదరాబాద్ మార్చి 16 : హైదరాబాద్‌లో మార్చి 16, 2025న జరిగిన మీడియా సమావేశంలో ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ…

    దేశానికి ఆదర్శంగా నిలిచిన నాయకుడు కేసీఆర్: హరీశ్ రావు

    దేశానికి ఆదర్శంగా నిలిచిన నాయకుడు కేసీఆర్: హరీశ్ రావు మనోరంజని ప్రతినిధి హైదరాబాద్ మార్చి 16 – తన పాలనతో దేశానికి ఆదర్శంగా నిలిచిన నాయకుడు మాజీ సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. రుణమాఫీపై తెలంగాణ భవన్‌లో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బీఆర్‌ఎస్‌ నాయకులు దళితుల పై చిన్నచూపు – డా. కూడెల్లి ప్రవీణ్ కుమార్

    బీఆర్‌ఎస్‌ నాయకులు దళితుల పై చిన్నచూపు – డా. కూడెల్లి ప్రవీణ్ కుమార్

    దారుణం.. కొడుకుతో కలిసి భర్తను కొట్టి చంపిన భార్య

    దారుణం.. కొడుకుతో కలిసి భర్తను కొట్టి చంపిన భార్య

    దేశానికి ఆదర్శంగా నిలిచిన నాయకుడు కేసీఆర్: హరీశ్ రావు

    దేశానికి ఆదర్శంగా నిలిచిన నాయకుడు కేసీఆర్: హరీశ్ రావు