విద్యే జీవితానికి రక్ష -రవీందర్ యాదవ్

విద్యే జీవితానికి రక్ష -రవీందర్ యాదవ్

చదువుల్లో విద్యార్థులు రాణించాలి

మియాపూర్ స్కూల్ లో స్టూడెంట్స్ కు ఎగ్జామ్ ఫ్యాడ్, పెన్నులు అందజేత

చదువుకు కుల, మత, పేద, ధనిక తేడాలు లేవు

ఇష్టపడి చదివితే గ్యమ్యస్థానం, ఉన్నత పదవులు సులువు

భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్ వెల్లడి

మనోరంజని, తెలంగాణ చీఫ్ బ్యూరో:

బంగారు భవిష్యత్ ను నిర్ణయించేది చదువేనని భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్ వెల్లడించారు. కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి ఉన్నత స్థానాల్లో నిలువాలని విద్యార్థులకు సూచించారు. గురువారం మియాపూర్ లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఎగ్జామ్ ఫ్యాడ్ లు, పెన్నులను బహుమతికి అందజేశారు. పరీక్షల సమయం కావడంతో ఎవరూ ఆందోళన చెందకుండా, నిబద్ధతతో చదవితే మంచి మార్కులను సాధించడం సులువు అని స్టూడెంట్స్ కు సూచించారు. చదువుకు కుల, మతాలతో సంబంధం లేదని, ఉన్నత స్థానాల్లో నిలిచేందుకు ఉపయోగపడేది కేవలం చదువేనని వెల్లడించారు. చదువుల్లో రాణించి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, స్కూల్ కి మంచి పేరును తీసుకురావాలన్నారు. చదువును బట్టి సమాజంలో గౌరవాలు దక్కుతాయన్నారు. ఎంత ఎత్తుకు ఎదగాలన్నా దానికి చదువు ఒక్కటే మార్గమన్నారు. పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులకు, చదివిన స్కూల్ కు మంచి పేరును తీసుకువచ్చేలా, భవిష్యత్ కి ఇప్పటి నుంచే బాటలు వేసుకుంటూ ముందుకు వెళ్లాలని రవీందర్ యాదవ్ విద్యార్థులకు సూచనలు చేశారు. పరీక్షల సమయం కాబట్టి విద్యార్థులు క్రమపద్ధతిలో చదివి మంచి మార్కులు సాధించాలని ఆకాంక్షించారు

  • Related Posts

    ఆర్థిక సహాయాన్ని అందజేసిన

    జంగరాయి గ్రామానికి చెందిన చిన్నంగల భారతమ్మ అనారోగ్యంతో మృతి చెందారని తెలుసుకొని ఆర్థిక సహాయాన్ని అందజేసిన లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ మనోరంజని వెల్దుర్తి మాసాయిపేట ప్రతినిధి ఏప్రిల్ 4- మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం జంగారాయి…

    శ్రీరామనవమి శోభా యాత్ర సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై…

    శ్రీరామనవమి శోభా యాత్ర సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై… ఇతర వర్గాలను కించపరిచే పాటలు, ప్రసంగాలు వద్దు మనోరంజని ప్రతినిధి హైదరాబాద్‌ సిటీ: ఏప్రిల్ 04 :-నగరంలో నిర్వహించే శ్రీరామ నవమి శోభాయాత్రకు దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉందని, శోభాయాత్రను శాంతియుతంగా, ప్రశాంతంగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఆర్థిక సహాయాన్ని అందజేసిన

    ఆర్థిక సహాయాన్ని అందజేసిన

    వక్ఫ్ బిల్లు ఆమోదంపై మోడీ కీలక వ్యాఖ్యలు

    వక్ఫ్ బిల్లు ఆమోదంపై మోడీ కీలక వ్యాఖ్యలు

    బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారుడు యూనస్‌తో ప్రధాని మోదీ భేటీ

    బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారుడు యూనస్‌తో ప్రధాని మోదీ భేటీ

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి పూజా హెగ్డే

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి పూజా హెగ్డే