వరి కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలిజిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్

వరి కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి
జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్

మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 28 – నిర్మల్ జిల్లా: రబి సీజన్ కు సంబంధించి వరి కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ అధికారులను ఆదేశించారు.
శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రబి వరి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, వరి కొనుగోలు ప్రక్రియలు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేయాలన్నారు. కొనుగోలు ప్రక్రియను చేపట్టే సిబ్బంది మొత్తం వరి కొనుగోలు ప్రక్రియ పై పూర్తి అవగాహనను కలిగి ఉండాలన్నారు. ఓపిఎంఎస్ యాప్ తో పాటు, జిల్లాలో వరి కొనుగోలు ప్రక్రియలను సులభతరం చేసేందుకై ప్రత్యేకంగా రూపొందించిన లోకల్ యాప్ పై, ట్యాబ్ ఎంట్రీ ప్రక్రియపై అందరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. వరి కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు టెంట్ త్రాగునీరు తదితర సౌకర్యాలను ఏర్పాటు చేయాలన్నారు. సరిపడినన్ని గన్నీ బస్తాలు, టార్పాలిన్లు, తూకపు యంత్రాలు, తేమయంత్రాలు, తదితర పరికరాలన్నీ సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.
ఈ సమావేశంలో ఆర్డీవో రత్నకళ్యాణి, డిఎస్ఓ కిరణ్ కుమార్, డిఎం వేణుగోపాల్, డిసిఒ పాపయ్య, ఇన్ ఛార్జ్ డిఆర్డిఓ శ్రీనివాస్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యం ద్వారా నిరుపేదలకు లబ్ది

    రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యం ద్వారా నిరుపేదలకు లబ్ది జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మనోరంజని ప్రతినిధి నిర్మల్ ఏప్రిల్ 08 :- రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్నబియ్యం ద్వారా నిరుపేదలకు ఎంతో లబ్ధి చేకూరుతుందని జిల్లా…

    సీఎం రేవంత్ రెడ్డి మరియు ఎమ్మెల్యే వివేక్ ఫ్లెక్సీ కి పాలాభిషేకం.

    సీఎం రేవంత్ రెడ్డి మరియు ఎమ్మెల్యే వివేక్ ఫ్లెక్సీ కి పాలాభిషేకం. *మనోరంజని మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి ఏప్రిల్ 08 :- మంచిర్యాల జిల్లా, చెన్నూరు మండలం సుద్దాల గ్రామములో సీఎం రేవంత్ రెడ్డి, మరియు ఎమ్మెల్యే వివేక్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    గిరిజన యువకుడు దారుణ హత్యగొడ్డలితో నరికి చంపిన దుండగులు

    గిరిజన యువకుడు దారుణ హత్యగొడ్డలితో నరికి చంపిన దుండగులు

    ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు.. సిద్ధంగా ఉండండి: WHO!

    ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు.. సిద్ధంగా ఉండండి: WHO!

    తెలంగాణ మాజీ గవర్నర్ తమిళ్ సై కి పితృవియోగం

    తెలంగాణ మాజీ గవర్నర్ తమిళ్ సై కి పితృవియోగం

    కామారెడ్డి లో మరోసారి బట్టబయలైన కల్తీకల్లు బాగోతం

    కామారెడ్డి లో మరోసారి బట్టబయలైన కల్తీకల్లు బాగోతం