లంచం తీసుకుంటూ పట్టుబడ్డ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్

మనోరంజని ప్రతినిధి మెదక్ మార్చి 11 :- తెలంగాణలో అవినీతి అధికారుల పై ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా మెదక్ పట్టణ & జిల్లా పురపాలక కార్యాలయ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ నకిరేకంటి జానయ్య ఓపెన్ ప్లాట్ మ్యుటేషన్ దరఖాస్తును మంజూరు చేయడానికి రూ. 20,000 లంచం డిమాండ్ చేశాడు. ఫిర్యాదుదారుడు ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు తెలియజేయగా, ఏసీబీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడానికి సన్నాహం చేసింది. ఫిర్యాదుదారుడి అభ్యర్థన మేరకు లంచం మొత్తాన్ని రూ. 12,000కి తగ్గించి, నగదు స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అవినీతి అధికారులు ప్రజల రక్తం తాగుతూనే ఉన్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ ఒక్కరూ అవినీతిపై పోరాడాలని, ఎవరైనా లంచం అడిగితే 1064 నంబర్‌కు కాల్ చేయాలని అధికారుల సూచన

  • Related Posts

    మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : గ్రంధాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

    మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : గ్రంధాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి మనోరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 13 :మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి అని రంగారెడ్డి జిల్లా చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా…

    జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌ వేటు అప్రజాస్వామికం

    జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌ వేటు అప్రజాస్వామికం నేడు జిల్లా వ్యాప్తంగా నిరసనలు, దిష్టి బొమ్మల దగ్ధం -పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని జీవన్ రెడ్డి పిలుపు మనోరంజని ప్రతినిధి నిజామాబాద్, మార్చి13 :- బీఆర్ఎస్ ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    దేశ వ్యాప్తంగా 5G సర్వీసు’

    దేశ వ్యాప్తంగా 5G సర్వీసు’

    మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : గ్రంధాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

    మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : గ్రంధాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

    ఈ నెలలో రెండు గ్రహణాలు

    ఈ నెలలో రెండు గ్రహణాలు

    వందేభారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్

    వందేభారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్