

రన్యారావు కేసు.. డీజీపీ రామచంద్రారావును సెలవుపై పంపిన రాష్ట్ర ప్రభుత్వం
అక్రమంగా బంగారం తరలిస్తూ పట్టుబడిన కన్నడ నటి రన్యారావు కేసులో ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. రన్యారావు సవతి తండ్రి, డీజీపీ రామచంద్రారావును ప్రభుత్వం సెలవుపై పంపింది. రామచంద్రారావు స్థానంలో తాత్కాలికంగా కె.వి.శరత్ చంద్రని నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వుల్లో ఎలాంటి కారణాన్ని పేర్కొనలేదు. నిన్న రన్యారావు బెయిల్ పిటిషన్‌ను ఈడీ న్యాయస్థానం తిరస్కరించిన సంగతి తెలిసిందే