మైనింగ్ యాప్ లోగోను ఆవిష్కరించిన మంత్రి మహేందర్ రెడ్డి

మైనింగ్ యాప్ లోగోను ఆవిష్కరించిన మంత్రి మహేందర్ రెడ్డి

మనోరంజని ప్రతినిధి హైదరాబాద్ మార్చి 17 :- గనులు, భూగర్భ వనరుల శాఖలో మరింత పారదర్శకతను పెంచుతూ అక్రమాలకు అడ్డుకట్ట వేసే దిశగా తెలంగాణ సర్కార్ ముందడుగు వేసింది. ఇందులో భాగంగా ‘ఈ మైనింగ్ మొబైల్ యాప్’ దోహదం చేస్తుందని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అన్నారు.హైదరాబాద్ లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయ భవనంలో సీఎస్ శాంతి కుమారి, గనుల శాఖ డీఎం జి పి. కాత్యాయని దేవిలతో కలిసి తెలంగాణ ఈ – మైనింగ్ మొబైల్ యాప్ ను మంత్రి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. తెలంగాణ గనులు, భూగర్భ వనరుల శాఖ మరియు హైదరాబాద్ లోని జాతీయ సమాచార విజ్ఞాన కేంద్రం (ఎన్ఐసి) సంయుక్తంగా ఈ మొబైల్ యాప్ ను అభివృద్ధి పరిచినట్లు చెప్పారు.ఈ మైనింగ్ యాప్ తో గనులు, ఇటుక, ఇసుక రవాణా జరిగినప్పుడు రవాణా వాహనాలను తనిఖీ చేసి ట్రాన్సిస్ట్ ఫామ్ మరియు ట్రాన్సిస్టర్ అనుమతులు ఉన్నాయా లేవా అని అంశాలను ఆన్ లైన్ లో వెంటనే సిబ్బంది తెలుసుకోవచ్చని తెలిపారు. అక్రమ రవాణా, అనుమతులు లేకుండా కానీ, అనుమతులు ఉన్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా అధిక మోతాదులో రవాణాకు పాల్పడితే వారిపై చర్యలు తీసుకోవచ్చని పేర్కొన్నారు. పెనాల్టీ విధించి ఆ సమాచారాన్ని వాహన యజమానికి ఆన్ లైన్ పద్ధతిలో లింక్ ద్వారా పంపించి వెంటనే పెనాల్టీ వసూలు చేసేందుకు సిబ్బందికి, అలాగే చెల్లించేందుకు వాహన యజమానికి వెసులుబాటు ఉంటుందని అన్నారు.డీలర్లు మరియు లీజు హోల్డర్లు ఖనిజ రవాణాలో ఆన్ లైన్ ద్వారా తమ రవాణా చేసుకునేందుకు శాఖా పరమైన అనుమతుల నిర్ధారణ సైతం తెలుసుకోవచ్చని వివరించారు. అలాగే తనిఖీలు నిర్వహించే గనుల శాఖ ఏడీలు, అసిస్టెంట్ జువాలజిస్టులు, టెక్నీషియన్లు, రాయల్టీ ఇన్స్పెక్టర్లకు వాహనాల తనిఖీ చాలా సులభం అవుతుందని వెల్లడించారు.

  • Related Posts

    చర్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్‌కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

    తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చర్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్‌కు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టాలని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి లేఖ రాశారు. భాషా ప్రాతిపదిక రాష్ట్రాల ఏర్పాటుకు శ్రీరాములు గారు…

    బూర్గుల రామకృష్ణారావు జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళి

    స్వాతంత్య్ర సమరయోధుడు, హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి స్వర్గీయ బూర్గుల రామకృష్ణారావు గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మహనీయుడి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ బూర్గుల రామకృష్ణారావు పరిపాలనా దక్షత, సాహితీ ప్రేమ,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    భారత బాక్సింగ్‌ సమాఖ్య నుంచి ఇద్దరిపై సస్పెన్షన్‌ వేటు

    భారత బాక్సింగ్‌ సమాఖ్య నుంచి ఇద్దరిపై సస్పెన్షన్‌ వేటు

    చర్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్‌కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

    చర్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్‌కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

    బీసీ రిజర్వేషన్లపై ప్రధాని అపాయింట్‌మెంట్ కోరిన సీఎం రేవంత్ రెడ్డి

    బీసీ రిజర్వేషన్లపై ప్రధాని అపాయింట్‌మెంట్ కోరిన సీఎం రేవంత్ రెడ్డి

    బూర్గుల రామకృష్ణారావు జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళి

    బూర్గుల రామకృష్ణారావు జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళి