మెగా బ్రదర్ నాగబాబు ఆస్తులెంత – అన్నయ్య చిరంజీవి కి, తమ్ముడు పవన్ కు అప్పు లెక్కలిలా..!

మెగా బ్రదర్ నాగబాబు ఆస్తులెంత – అన్నయ్య చిరంజీవి కి, తమ్ముడు పవన్ కు అప్పు లెక్కలిలా..!

మెగా బ్రదర్ నాగబాబు ఎమ్మెల్సీ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేసారు. కూమటి నుంచి అయిదు ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేయాల్సి ఉంది. రేపు (సోమవారం) నామినేషన్లకు చివరి రోజు. జనసేన నుంచి నాగబాబు నామినేషన్ దాఖలు చేయటంతో..మిగిలిన నలుగురు టీడీపీ నుంచి నామినేషన్లు వేయనున్నారు. వారి పేర్లను ఈ రోజు ఫైనల్ చేసే అవకాశం ఉంది. కాగా, నాగబాబు తన ఎన్నికల అఫిడవిట్ తో తన ఆస్తులతో పాటుగా అప్పుల లెక్కలను వెల్లడించారు. అన్నయ్య చిరంజీవి, తమ్ముడుకు పవన్ కు చెల్లించాల్సిన అప్పుల గురించి వివరించారు.

నాగబాబు ఆస్తులు
జనసేన నుంచి నాగబాబు కూటమి ఎమ్మెల్సీ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేసారు. ఎన్నికల అఫిడవిట్‌లో నాగబాబు తన ఆస్తులు, అప్పుల వివరాలను పొందుపర్చారు. నాగబాబు తన ఆస్తుల విలువ70 కోట్లుగా వెల్లడించారు. నాగబాబుపైన ఎలాంటి కేసులు లేవు. కాగా, తనకు ఉన్న అప్పుల లెక్కలను వెల్లడిస్తూ అన్నయ్య చిరంజీవి.. తమ్ముడు పవన్ దగ్గర తీసుకున్న అప్పుల గురించి వివరించారు. నాగబాబు చరాస్తుల విలువ 59 కోట్లుగా పేర్కొన్నారు. బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్, నగదు కలిపి 59 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. మ్యూచువల్ ఫండ్స్ .. బాండ్ల రూపంలో రూ.55.37 కోట్లు ఉండగా, చేతిలో నగదు – రూ.21.81 లక్షలు ఉంది.

ఇవీ లెక్కలు ఇక, బ్యాంకులో తన ఖాతాల్లో రూ 23.53 లక్షలు ఉన్నట్లు నాగబాబు వెల్లడించారు. ఇతరుల నుంచి తాను రూ 1.03 కోట్లు అప్పులు తీసుకున్నట్లు పేర్కొన్నారు. తనకు ఉన్న బెంజ్ కారు విలు వ రూ 67.28 లక్షలుగా వెల్లడించారు. హ్యుండాయ్ కారు – రూ.11.04 లక్షలు, కాగా ఇక.. బంగారం -వెండి విలువ రూ.57.99గా వివరించారు.724 గ్రాముల బంగారం, తన సతీమణి వద్ద 55 క్యారట్ల వజ్రాలు (రూ.16.50 లక్షలు), 20 కేజీల వెండి (రూ.21.40 లక్షలు) ఉన్నాయి. అదే విధంగా.. హైదరాబాద్ పరిసరాల్లో 11 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు వెల్లడించారు.

తన సోదరులు చిరంజీవి దగ్గర రూ.28.48 లక్షలు అప్పు తీసుకోగా.. పవన్ కల్యాణ్ దగ్గర రూ.6.90 లక్షలు అప్పు తీసుకు న్నట్లు నాగబాబు వెల్లడించారు. ఇక, బ్యాంకుల్లో ఇంటి రుణం కింద రూ 56.97 లక్షలు, కారు కోసం తీసుకున్న రుణం రూ 7.54 లక్షలు ఉన్నట్లు వివరించారు

  • Related Posts

    మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న నారా లోకేష్ దంపతులు

    మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి నిర్వహించిన స్వామి వారి కల్యాణమహోత్సవంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, నారా బ్రాహ్మణి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మీ నరసింహస్వామివారికి ప్రభుత్వం తరఫున నారా…

    రేపు జనసేన ఆవిర్భావ సభ ప్రారంభం

    రేపు జనసేన ఆవిర్భావ సభ ప్రారంభం మనోరంజని ప్రతినిధి మార్చి 13 :- ఆంధ్రప్రదేశ్ : జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ రేపు (శుక్రవారం) ప్రారంభం అవుతుందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. సా. 3.30 గంటల నుంచి సభ మొదలుకానుందని, 1600…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మసీదులు, ఆలయాల్లో లౌడ్‌ స్పీకర్లపై ఆంక్షలు: యూ

    మసీదులు, ఆలయాల్లో లౌడ్‌ స్పీకర్లపై ఆంక్షలు: యూ

    రౌడీ షీట్ ఓపెన్ చేస్తే చెల్లదు.. రౌడీ షీట్ కు చట్టబద్దత లేదు”

    రౌడీ షీట్ ఓపెన్ చేస్తే చెల్లదు.. రౌడీ షీట్ కు చట్టబద్దత లేదు”

    రళలో అధిక స్థాయిలో అతినీలలోహిత కిరణాలు(UV Rays)

    రళలో అధిక స్థాయిలో అతినీలలోహిత కిరణాలు(UV Rays)

    ఎమ్మెల్యే నివాసంలో మిన్నంటిన హోలీ సంబరాలు

    ఎమ్మెల్యే నివాసంలో మిన్నంటిన హోలీ సంబరాలు