

ముస్తఫానగర్ పాఠశాలలో త్రాగునీటి ఫిల్టర్ వితరణ
మనోరంజని ప్రతినిధి రాజన్న సిరిసిల్ల మార్చి 12 :-రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని ముస్తఫానగర్ గ్రామ పాఠశాలలో విద్యార్థుల ఆరోగ్య భద్రతకు శుద్ధమైన త్రాగునీటిని అందించేందుకు చాయ్ దునియా మేనేజింగ్ డైరెక్టర్ సుదర్శన్ బండ గారు త్రాగునీటి ఫిల్టర్ వితరణ చేశారు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గ్రామ ప్రజలు మరియు పాఠశాల యాజమాన్యం త్రాగునీటి సమస్య గురించి ఆయన దృష్టికి తీసుకెళ్లగా, వితరణ చేయాలని హామీ ఇచ్చారు. ఈ హామీని నెరవేర్చుతూ త్రాగునీటి ఫిల్టర్‌ను ఏర్పాటు చేసి, విద్యార్థులకు వెంటనే శుద్ధమైన నీటిని అందించారు. సుదర్శన్ బండ గారి సేవా కార్యక్రమాన్ని గుర్తించి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మరియు మండల విద్యాధికారి ఆయనను శాలువాతో సత్కరించి ఘనంగా అభినందనలు తెలిపారు. గ్రామ ప్రజలు, పాఠశాల అధికారులు ఆయన సేవా స్పృహను ప్రశంసించారు
