మీడియా అండ్‌ కమ్యూనికేషన్స్‌ అడ్వైజర్‌గా అల్లం నారాయణ

మీడియా అండ్‌ కమ్యూనికేషన్స్‌ అడ్వైజర్‌గా అల్లం నారాయణ

హైదరాబాద్‌: తెలంగాణ సమాచార పౌర సంబంధాల శాఖలో మరో కీలక పరిణామం..! మీడియా అండ్‌ కమ్యూనికేషన్స్‌ అడ్వైజర్‌గా ప్రెస్‌ అకాడమీ మాజీ చైర్మన్‌, సీనియర్‌ పాత్రికేయులు అల్లం నారాయణను నియమించనున్నట్టు తెలిసింది. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్‌ సర్కారు నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. అల్లం నారాయణకు కేబినెట్‌ ర్యాంకులో ఈ హోదాను ప్రకటించే అవకాశాలున్నాయి. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల తరపున కీలక పాత్ర పోషించిన ఆయనను సముచితంగా గౌరవించాలనే ఉద్దేశంతోనే సీఎం రేవంత్‌ సర్కారు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ప్రొఫెసర్‌ కోదండరాం, అందెశ్రీ, సుద్దాల అశోక్‌ తేజలతో పాటు అంబేద్కర్‌ ఓపెన్‌ వర్సిటీ వీసీగా ఘంటా చక్రపాణిలను ప్రజాపాలనలో సముచితంగా గౌరవించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమంలో, మీడియా రంగంలో విశేష సేవలందించిన అల్లం నారాయణ అనుభవాన్ని ప్రజాపాలనలో భాగస్వామ్యం చేయాలని రాష్ట్ర సర్కారు మీడియా అండ్‌ కమ్యూనికేషన్స్‌ అడ్వైజర్‌గా నియమించాలని భావిస్తున్నట్టు సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా చేయనున్నట్టు తెలిసింది

  • Related Posts

    జాతీయ స్థాయి యోగాలో సత్తాచాటిన రబింద్ర విద్యార్థులు

    జాతీయ స్థాయి యోగాలో సత్తాచాటిన రబింద్ర విద్యార్థులు మనోరంజని ప్రతినిధి ముధోల్ ఏప్రిల్ 09 :- నిర్మల్ జిల్లా ముధోల్. మండల కేంద్రమైన ముధోల్లోని రబింద్ర ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు యోగాసన స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పంజాబ్ లుదియానాకు…

    భైంసా ముద్దుబిడ్డ…సాయికుమార్ పటేల్ విజయగాథ

    భైంసా ముద్దుబిడ్డ…సాయికుమార్ పటేల్ విజయగాథ మనోరంజని ప్రతినిధి భైంసా ఏప్రిల్ 09 :- నిర్మల్ జిల్లా భైంసా పట్టణానికి చెందిన ఎస్. సాయికుమార్ రత్నమాల-పొట్లపల్లి సిద్ధేశ్వర్ పటేల్ కుమారుడు తన పట్టుదల, ఆత్మవిశ్వాసంతో తెలంగాణ రాష్ట్ర గ్రూప్-1 ఫలితాల్లో 157వ ర్యాంకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    జాతీయ స్థాయి యోగాలో సత్తాచాటిన రబింద్ర విద్యార్థులు

    జాతీయ స్థాయి యోగాలో సత్తాచాటిన రబింద్ర విద్యార్థులు

    భైంసా ముద్దుబిడ్డ…సాయికుమార్ పటేల్ విజయగాథ

    భైంసా ముద్దుబిడ్డ…సాయికుమార్ పటేల్ విజయగాథ

    అధైర్యపడొద్దు..అండగా నేనున్నా

    అధైర్యపడొద్దు..అండగా నేనున్నా

    గ్రామాల్లో ఘనంగా అంబలి బార్సి పండుగ

    గ్రామాల్లో ఘనంగా అంబలి బార్సి పండుగ