భార్యలు తాగుతున్నారని పోలీస్ స్టేషన్లో భర్తల ఫిర్యాదు!

భార్యలు తాగుతున్నారని పోలీస్ స్టేషన్లో భర్తల ఫిర్యాదు!

మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 13 – మా ఇంటాయన తాగు బోతు అయిపోయాడు.. సంసారం నాశనమైపోతుం దని అడవాళ్లు ఆవేదన వ్యక్తం చేయడం సహజం. కానీ, ఇక్కడ మాత్రం మా ఆడాళ్లు తాగుబోతులైపోయారని, తమ కష్టాన్ని తాగుడుకే దారపోస్తున్నా రని,పురుష మా లోకం లబోదిబోమంటున్నారు. మద్యానికి బానిసలైన మా పెళ్లాలు తాము కూలి పనులు చేసిన సంపాదిస్తు న్నదంతా సారాకు తగలే స్తున్నారని, మీరే తమను, తమ కుటుంబాలను ఆదుకోవాలని భర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విస్మయానికి గురిచేసే ఈ సంఘటన ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో వెలుగుచూసింది. బొరిగుమ్మ సమితిలోని పూజారిపుట్‌ పంచాయతీ కొండగూడ గ్రామానికి చెందిన కొంత మంది వ్యక్తులు.. తమ భార్యలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన కొందరు యువకులు గత నాలుగేళ్లుగా నాటు సారా తయారుచేస్తూ విక్రయిస్తు న్నారని తెలిపారు. ఊళ్లో మగాళ్లంతా కూలిపనులు చేస్తూ డబ్బులు సంపాది స్తుంటే.. అడవాళ్లు తమ కష్టాన్ని మద్యానికి ధారబోసేస్తున్నారని వాపోయారు. దీంతో కుటుంబాలు చిన్నాభిన్నమై.. తమ పిల్లల భవిష్యత్తు అంధకారంలోకి వెళుతోందని వారికి ఏడుపు ఒక్కటే తక్కువయ్యింది. సారా తయారీ స్థావరాలపై దాడులు చేయాలని వారు కోరారు. బుధవారం పోలీ సులు, ఆబ్కారీ అధికారుల దృష్టికి సమస్యను తీసు కెళ్లిన బాధితులు.. సారాను అడ్డుకోవాలని కోరారు

  • Related Posts

    హీరో బాల‌కృష్ణ ఇంటి ఫెన్సింగ్‌ను ఢీకొట్టిన కారు

    హీరో బాల‌కృష్ణ ఇంటి ఫెన్సింగ్‌ను ఢీకొట్టిన కారు టాలీవుడ్ సీనియ‌ర్‌ నటుడు నందమూరి బాలకృష్ణ ఇంటి ముందు శుక్రవారం తెల్లవారుజామున ఓ కారు బీభత్సం సృష్టించింది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబర్‌-1లో వేగంగా వచ్చిన ఓ కారు బాలయ్య ఇంటి ముందున్న…

    కరెంటు హై టెన్షన్ వైరు పట్టుకొని ఆత్మహత్య

    45 లక్షల ప్యాకేజితో ఉద్యోగం..అంతా సాఫి గా అనుకునే సమయంలో…కాచిగూడ టూ గిద్దలూరు …వెళ్ళాడు…అక్కడ గూడ్స్ పైకి ఎక్కి… కరెంటు హై టెన్షన్ వైరు పట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు… కారణం ఏంటో అనే కోణం లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు! మనోరంజని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    2028 కల్లా మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

    2028 కల్లా మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

    మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న నారా లోకేష్ దంపతులు

    మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న  నారా లోకేష్ దంపతులు

    రేపటి నుండి ఒంటిపూట బడులు

    రేపటి నుండి ఒంటిపూట బడులు

    హీరో బాల‌కృష్ణ ఇంటి ఫెన్సింగ్‌ను ఢీకొట్టిన కారు

    హీరో బాల‌కృష్ణ ఇంటి ఫెన్సింగ్‌ను ఢీకొట్టిన కారు