బ్రో అన్నాడని డెలివరీ బాయ్‌పై కుక్క ను కొట్టిన విధంగా దాడి చేచిన డిపార్ట్మెంట్ వాడు

బ్రో అన్నాడని డెలివరీ బాయ్‌పై కుక్క ను కొట్టిన విధంగా దాడి చేచిన డిపార్ట్మెంట్ వాడు

మనోరంజనిప్రతినిది వరంగల్ మార్చి 27 – ఓ డెలివరీ బాయ్‌ను దుస్తులు విప్పి కొట్టిన ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. దీనిపై అవమానంగా భావించిన అతడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న నగరంలోని తోటి డెలివరీ బాయ్స్ అపార్టుమెంట్‌ వద్ద ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.నిందితుడు ప్రసాద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సీతమ్మ ధారలోని ఓ అపార్ట్‌మెంట్‌లో స్విగ్గి డెలివరీ బాయ్ అనిల్ ఆర్డర్ డెలివరీ కోసం ప్రసాద్ ఇంటికి వెళ్లాడు. ఈ సందర్భంగా అతడిని బ్రో అని పిలవడంతో ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘నన్ను సార్ అని పిలవాలి. బ్రో అని కాదు’ అంటూ అనిల్‌పై దాడి చేశాడు. అంతే కాకుండా సెక్యూరిటీ సిబ్బంది సహాయంతో అనిల్‌ను కొట్టి అతడి బట్టలు చించి గేటు వద్ద నిలబెట్టి క్షమాపణ లేఖ రాయాలని బలవంతం చేశాడని పోలీసులు తెలిపారు.విశాఖపట్నంలోని ఆక్సిజన్ టవర్స్ లో ఫుడ్ డెలివరీ బాయ్స్‌పై ఓ ఫ్లాట్ యజమాని దాడి చేసిన నేపథ్యంలో, ఆరు నెలల పాటు ఆ అపార్ట్‌మెంట్ లోపలికి డెలివరీలు చేయమని డెలివరీ బాయ్స్ నిర్ణయం తీసుకున్నారు, కేవలం ప్రధాన గేటు వద్ద డెలివరీ ఇస్తామని తెలిపారు.ఈ దాడిపై డెలివరీ బాయ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ టీవీ ఫుటేజ్, ప్రత్యక్ష సాక్షుల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రసాద్‌ను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపర్చారు. దాడిపై విశాఖలో డెలివరీ వర్కర్లు నిరసనలు చేపట్టారు. డెలివరీ సిబ్బంది భద్రతపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. డెలివరీ బాయ్‌ను ప్రసాద్ కొడుతున్న దృశ్యాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి

  • Related Posts

    బాసరలో వేద భారతి పీఠం విద్యాలయంలో విషాదం

    బాసరలో వేద భారతి పీఠం విద్యాలయంలో విషాదం మనోరంజని ప్రతినిధి భైంసా ఏప్రిల్ 04 :- నిర్మల్ జిల్లా బాసర మండలకేంద్రంలో వేద భారతి విద్యాలయంలో విషాదం చోటుచేసుకుంది. గత కొద్ది రోజుల క్రితం అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో దాడికి గురై…

    రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి తీవ్రగాయాలు

    రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి తీవ్రగాయాలు మనోరంజని ప్రతినిధి భైంసా ఏప్రిల్ 04 :- నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని దేగాం గ్రామ సమీపంలోని హరియాలీ కన్వెన్షన్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఆర్థిక సహాయాన్ని అందజేసిన

    ఆర్థిక సహాయాన్ని అందజేసిన

    వక్ఫ్ బిల్లు ఆమోదంపై మోడీ కీలక వ్యాఖ్యలు

    వక్ఫ్ బిల్లు ఆమోదంపై మోడీ కీలక వ్యాఖ్యలు

    బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారుడు యూనస్‌తో ప్రధాని మోదీ భేటీ

    బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారుడు యూనస్‌తో ప్రధాని మోదీ భేటీ

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి పూజా హెగ్డే

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి పూజా హెగ్డే