బోసి గ్రామంలో భూసార పరీక్ష క్యాంపు.

బోసి గ్రామంలో భూసార పరీక్ష క్యాంపు.

మనోరంజని ప్రతినిధి తానుర్ మార్చి 29 :-*మా అమ్మ నాన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో బోసి గ్రామంలో భూసార పరీక్ష క్యాంపు శనివారం ఏర్పాటు చేశారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక సహాయంతో కేవలం 5 నిమిషాల్లో భూసార పరీక్ష చేసే విధానాన్ని అగ్రి ఫాబ్రిక్స్ సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. సంస్థ కో ఫౌండర్ ,డైరెక్టర్ మెండు శ్రీనివాసులు దీనిని ప్రారంభించారు. నేలలో నత్రజని భాస్వరం పోటాష్ తో పాటు నేల ఉదజని సూచిక , నేలలో సేంద్రియ కర్బన శాతం, ఈసీ మొదలగు విషయాలు కేవలం 5 నిమిషాల్లో రైతులకు అతి తక్కువ ఖర్చులో తెలియజేయడం జరుగుతుందని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అవసరమైన ఎరువులను మాత్రమే భూమిలో వేయాలని సూచించారు. దీనివల్ల నేలలు సారవంతం అవ్వడమే కాకుండా రైతులు తమ పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవచ్చని తెలియజేస్తూ భూసార పరీక్ష కేంద్ర ఏర్పాటుకు ముందుకొచ్చిన ఆంజనేయులు ను సంస్థ డైరెక్టర్ మెండు శ్రీనివాస్ అభినందించారు ఈ కార్యక్రమంలో ఏ ఈ ఓ లు అశోక్ కుమార్, విష్ణుదాస్ , సంస్థ టెక్నికల్ అధికారి కవిత, పరిమల్ రాజ్ రైతులు పాల్గొన్నారు

  • Related Posts

    సేంద్రియ వ్యవసాయ క్షేత్రాలను సందర్శించడానికి బస్సు ఏర్పా టు చేయాలి.

    సేంద్రియ వ్యవసాయ క్షేత్రాలను సందర్శించడానికి బస్సు ఏర్పా టు చేయాలి.-రైతు సహకార సంఘం రైతులు వినతి. మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ ఏప్రిల్ 10 – నిర్మల్ జిల్లా – సారంగాపూర్: సేంద్రియ వ్యవసాయ క్షేత్రాలు, పండ్ల పెంపకం తెలుసుకోవడానికి మహారాష్ట్రలోని వివిధ…

    వెంకటేశ్వర ఎస్సీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 25 కిలోల బియ్యం అందజేత

    వెంకటేశ్వర ఎస్సీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 25 కిలోల బియ్యం అందజేత *మనోరంజని మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి ఏప్రిల్ 10 :- భీమారం మండలంలో కేంద్రం లోని సుంకరిపల్లి వాడకు చెందిన జుమ్మిడి తిరుపతి అనారోగ్యం కారణంగా మరణించారు..…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    సేంద్రియ వ్యవసాయ క్షేత్రాలను సందర్శించడానికి బస్సు ఏర్పా టు చేయాలి.

    సేంద్రియ వ్యవసాయ క్షేత్రాలను సందర్శించడానికి బస్సు ఏర్పా టు చేయాలి.

    మహాత్మా జ్యోతిరావ్ ఫూలే జయంతి సందర్భంగా – ఓ సమానత్వ దీపస్తంభానికి కృతజ్ఞతాంజలి

    మహాత్మా జ్యోతిరావ్ ఫూలే జయంతి సందర్భంగా – ఓ సమానత్వ దీపస్తంభానికి కృతజ్ఞతాంజలి

    వెంకటేశ్వర ఎస్సీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 25 కిలోల బియ్యం అందజేత

    వెంకటేశ్వర ఎస్సీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 25 కిలోల బియ్యం అందజేత

    లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేసి సాగునీరు తాగునీరు అందించాలి.

    లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేసి సాగునీరు తాగునీరు అందించాలి.