బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత

బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత

తాగునీటి అవసరాల కోసం 0.6 టీఎంసీల నీరు విడుదల

పాల్గొన్న సిడబ్ల్యుసి రెండు రాష్ట్రాల అధికారులు

నది పరివాహక ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలి

మనోరంజని ప్రతినిది భైంసామార్చి 01 మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లాలో గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను అధికారులు శుక్రవారం ఎత్తివేశారు. కేంద్రజలవనరుల సంఘం ఒప్పందం మేరకు జూలై 1వ తేదీన ఏటా తెరుస్తారు. 120 రోజుల పాటు ఈ గేట్లు తెరిచి ఉంటాయి. తిరిగి అక్టోబరు 29న మూసివేస్తారు. గేట్ల మహారాష్ట్ర బాబ్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్‌ , నిర్మల్ జిల్లా బాసర మీదుగా నీరు రాష్ట్రంలోకి ప్రవేశించి దిగువన ఉన్న శ్రీరామ్​సాగర్‌ ప్రాజెక్టు వైపు ప్రవహిస్తుంది. గేట్లు ఎత్తడంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని బాసర తాసిల్దార్ పవన్ చంద్ర, ఎస్సై గణేష్ గోదావరి నది పరివాహక ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అన్నారు. గోదావరి నదిలో చేపలు పట్టే జాలర్లకు నది పరివాహక ప్రాంతాల వారికి హెచ్చరికలు జారి చేశారు. 2013లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ప్రతి ఏడాది జులై 1 నుంచి అక్టోబర్​ 28 వరకు బాబ్లీ గేట్లు ఎత్తుతారు. అక్టోబర్​29 నుంచి జూన్​30 దాకా మూసి ఉంచుతారు. మధ్యలో మార్చి 1న మాత్రం తాగునీటి అవసరాల కోసం 0.6 టీఎంసీలను కిందకు వదిలారు. ఇప్పటికే గోదావరి నదిలో భారీ సంఖ్యలో వరద నీరు ఉండడంతో దిగువన పోచంపాడ్ ప్రాజెక్టులో అనుకున్న స్థాయిలో నీరు ఉన్నదని అధికారులు తెలిపారు. కేంద్ర జలవనరుల శాఖ అధికారులతో పాటు కే వెంకటేశ్వర్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ యూజీడి హైదరాబాద్ ఎం చక్రపాణి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ప్రశాంత్ కడెం డిప్యూటీ ఇంజనీర్ నాందేడ్ మహారాష్ట్ర రవి కొత్త శ్రీరాంసాగర్ ప్రాజెక్టు సచిన్ దేవ్ కాంప్లె జూనియర్ ఇంజనీర్ బాబులి ప్రాజెక్ట్ వినయ సుశాంత్ రెడ్డి రాంసాగర్ ప్రాజెక్టు అధికారులు తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    ముస్తఫా నగర్ గ్రామ ప్రజలందరికి హోలీ శుభాకాంక్షలు

    ముస్తఫా నగర్ గ్రామ ప్రజలందరికి హోలీ శుభాకాంక్షలు మనోరంజని ప్రతినిధి మార్చి 15 – గ్రామ ప్రజలంతా సహజ సిద్ధమైన రంగులతో ఆనందంగా హోలీ పండగ జరుపుకోవాలని కోరుకుంటూ ఈ హోలీ పండుగ మన జీవితాల్లో కొత్త రంగులు నింపాలని, అందరూ…

    నేడు అసెంబ్లీలో కీలక బిల్లు

    నేడు అసెంబ్లీలో కీలక బిల్లు ప్రవేశపెట్టనున్న సీఎం రేవంత్ రెడ్డి మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 15 – మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి ఢిల్లీ పర్యటన ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి సభకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    న్యూస్ హెడ్ లైన్స్

    న్యూస్ హెడ్ లైన్స్

    15-03-2025 / శనివారం / రాశి ఫలితాలు

    15-03-2025 / శనివారం / రాశి ఫలితాలు

    ముస్తఫా నగర్ గ్రామ ప్రజలందరికి హోలీ శుభాకాంక్షలు

    ముస్తఫా నగర్ గ్రామ ప్రజలందరికి హోలీ శుభాకాంక్షలు

    నేడు అసెంబ్లీలో కీలక బిల్లు

    నేడు అసెంబ్లీలో కీలక బిల్లు