

బాధిత రైతుకు అండగా ఉంటా
ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్
మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 07 :- విష ప్రభావానికి గురై బైంసా మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో పుణేందర్ అనే రైతుకు చెందిన రెండు వేల కోళ్లు మృతి చెందడంతో శుక్రవారం బాధిత రైతును ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పరామర్శించారు. ఈ సందర్భంగా జరిగిన సంఘటనపై ఆరా తీసి, అండగా ఉంటానని మనోధైర్యాన్ని కల్పించారు. ప్రభుత్వపరంగా, ఏదైనా సంక్షేమ పథకాల ద్వారా సహాయాన్ని అందేటట్లు చూస్తానన్నారు. ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమని, పూర్తిస్థాయిలో విచారణ సంబంధిత అధికారులు చేపట్టాలన్నారు. ఆయన వెంట నాయకులు సొలంకీ భీంరావ్, పండిత్ రావ్, మాజీ సర్పంచ్ రమేష్, మాజీ ఎం. పి. టి. సి. అశోక్, నాయకులు భూమారెడ్డి, సంజీవ్ రావ్, రామరావ్, దుబాయ్ శ్రీను, తదితరులు పాల్గొన్నారు.