బర్డ్‌ ఫ్లూ ఎఫెక్ట్..

బర్డ్‌ ఫ్లూ ఎఫెక్ట్..

కోళ్లఫారాల్లో పెరుగుతున్న గుడ్ల నిల్వలు

చెన్నై: నామక్కల్‌ కోళ్ల ఫారాల్లో 2 కోట్ల గుడ్లు నిల్వ ఉండడంతో యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నామక్కల్‌ మండల పరిధిలో నామక్కల్‌, ఈరోడ్‌, తిరుప్పూర్‌, పల్లడం తదితర ప్రాంతాల్లో 6 కోట్లకు పైగా కోళ్లను పెంచుతున్నారు. ఆ కోళ్లు ప్రతిరోజు 5 కోట్ల గుడ్లు పెడుతుంటాయి. ఈ గుడ్లను రాష్ట్ర ప్రభుత్వ పౌష్టికాహార పథకంలో వినియోగిస్తుండగా, పొరుగు రాష్ట్రాలు, విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బర్డ్‌ ఫ్లు విస్తరణ, ఎండల కారణంగా ప్రజలు కోడిగుడ్ల వినియోగం తగ్గించారు.దీంతో, కోళ్ల ఫాంలలో గుడ్లు నిల్వలు పెరుగుతున్నాయి. డిమాండ్‌ తగ్గడంతో ఐదు రోజుల్లో గుడ్డుపై సుమారు 1.10 పైసలు తగ్గించి ప్రస్తుతం ఫాం ధర 3.80 పైసలుగా ఉంది. ప్రస్తుతం పాంలలో 2 కోట్ల గుడ్లు నిల్వ ఉన్నాయని, మరో రెండు రోజుల్లో ఇవి పాడయ్యే అవకాశముందని, అలాగే, నిల్వలు కూడా పెరిగే అవకాశముందని ఫాం యజమానులు వాపోతున్నారు

  • Related Posts

    అమెరికాలో రోడ్డు ప్రమాదం

    ఫ్లాష్ ఫ్లాష్ అమెరికాలో రోడ్డు ప్రమాదం కొందుర్గు వాసుల మృతి అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గానికి చెందినవారు మృత్యువతపడ్డారు. షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలం టేకులపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మోహన్…

    బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో దారుణం

    బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో దారుణం వైద్యం కోసం వచ్చిన వ్యక్తిని మృతి గుడ్డు చప్పుడు కాకుండా మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు హాస్పిటల్ ముందు కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్న వైనం రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని శ్రీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    అమెరికాలో రోడ్డు ప్రమాదం

    అమెరికాలో రోడ్డు ప్రమాదం

    ఏపీలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు

    ఏపీలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు

    విద్యుత్ బకాయిలను విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ను కోరిన ➖ కోలిపాక లక్ష్మణ్

    విద్యుత్ బకాయిలను విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ను కోరిన ➖ కోలిపాక లక్ష్మణ్

    బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో దారుణం

    బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో దారుణం