పోసాని కృష్ణ మురళి బెయిల్ పిటిషన్ పై వాయిదా?

పోసాని కృష్ణ మురళి బెయిల్ పిటిషన్ పై వాయిదా?

మనోరంజని ప్రతినిధి అమరావతి: మార్చి 18 – పోసాని కృష్ణ మురళి సీఐడీ విచారణ ఈరోజు ముగిసింది. చంద్రబాబు అధికారం కోసం అమిత్‌ షా కాళ్లు పట్టుకున్నారంటూ ఒక ఫోటోను తయారు చేసి దాన్ని మీడియా సమావే శంలో పెట్టి.. ఏపీ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు పోసాని. దీనిపై గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన తెలుగు యువత నేత వంశీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఆ కేసులో ప్రస్తుతం పోసాని రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దీంతో పోసానిని కస్టడీలోకి తీసుకున్న సీఐడీ అధికారులు… ఆ ఫోటోను ఎవరు తయారు చేశారు.. ఫోటో ఎక్కడి నుంచి వచ్చింది.. పోసానినే ఫోటో తయారు చేసి మీడియా సమావేశం పెట్టారా? లేక మరెవరైనా ఫోటో తయారు చేసి సమావేశం పెట్టమని ఆదేశించారా? అనే కోణంలో కస్టడీలో సీఐడీ అధికారులు పోసానిని ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. విచారణ తర్వాత జీజీహెచ్‌లో పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత జిల్లా జైలుకు తరలించారు అయితే పోసానిని మరోసారి కస్టడీ విచారణకు తీసుకోవాలని సీఐడీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పోసాని బెయిల్ పిటిషన్ బుధవారానికి కోర్టు వాయిదా వేసింది. పోసాని కృష్ణమురళిని కస్టడీకి అనుమతిస్తూ గుంటూరు ఆరో అదనపు జూనియర్‌ సివిల్‌ న్యాయస్థానం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది

  • Related Posts

    భార్య చెవి కోసి కమ్మలు తీసుకెళ్లిన భర్త

    : భార్య చెవి కోసి కమ్మలు తీసుకెళ్లిన భర్త మద్యానికి కట్టుకున్న తీసుకెళ్లిన మద్యానికి బానిసైన ఓ వ్యక్తి దారుణానికి బరితెగించారు. కట్టుకున్న భార్య చెవి కోసి అమ్మడానికి కమ్మలు తీసుకెళ్లిన ఘటన అనంతపురం జిల్లా. పెద్దపప్పూరు మండలం వరదాయపల్లి నికి…

    మానవత్వం చాటుకున్న మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్

    మానవత్వం చాటుకున్న మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ మనోరంజని ప్రతినిధి ప్రొద్దుటూరు మార్చి 22 :- స్ధానిక : ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గుర్తుతెలియని వృద్దుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతిని అంతిమ సంస్కరణలు చేయడానికి రెండు రోజులు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కుభీర్ తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి 50లక్షల రూపాయల నిధుల మంజూరు

    కుభీర్ తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి 50లక్షల రూపాయల నిధుల మంజూరు

    భార్య చెవి కోసి కమ్మలు తీసుకెళ్లిన భర్త

    భార్య చెవి కోసి కమ్మలు తీసుకెళ్లిన భర్త

    మానవత్వం చాటుకున్న మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్

    మానవత్వం చాటుకున్న మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్

    Local Elections: ఆశావహులకు బిగ్ అలర్ట్.. ‘స్థానిక’ ఎన్నికలు అప్పుడే..!!

    Local Elections: ఆశావహులకు బిగ్ అలర్ట్.. ‘స్థానిక’ ఎన్నికలు అప్పుడే..!!