

పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు
నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ మండలం, మార్చ్ 11 మనోరంజని ప్రతినిధి,
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ శివారులో పక్కా సమాచారం మేరకు సాయంత్రం పూట పెర్కిట్ లోని మహిళా ప్రాంగణం వెనుకాల గల ఖాళీ స్థలములో పేకాట ఆడుతున్న నలుగురిని పట్టుకుని వారి వద్ద నుండి 5340/- రూపాయలు మరియు 04 మొబైల్ ఫోన్లు అలాగే 04 బైకులను స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేయడం జరిగింది,ఆర్మూర్ పోలీస్ స్టేషన్, సీఐ పి.సత్యనారాయణ, తెలిపారు