పద్యకవి వెంకట్కు డాక్టర్ ఆఫ్ తెలుగు లిటరేషర్ అవార్డు

పద్యకవి వెంకట్కు డాక్టర్ ఆఫ్ తెలుగు లిటరేషర్ అవార్డు

మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 15 :- ప్రముఖ పద్యకవి, వ్యాఖ్యాత, ఉపన్యాసకులు, సంస్కృతభాషా ప్రచార సమితి ఆదిలాబాదు, నిజామాబాదు ఉమ్మడి జిల్లాల వ్యవస్థాపక అధ్యక్షులు బి. వెంకట్ ఫ్రెండ్షిప్ మినిస్ట్రీస్ సంస్థ, ఇందిర ఆర్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాదులోని హిమాయత్ నగర్ లో గల సారెగ స్టూడియోలో శనివారం జరిగిన సినీసంగీత విభావరి, కవిసమ్మేళనము, అవార్డుల ప్రదానోత్సవములో డాక్టర్ ఆఫ్ తెలుగు లిటరేషర్ అవార్డు 2025 ను ఫ్రెండ్షిప్ మినిస్ట్రీస్ చైర్మన్ డా.ఆలూరి విల్సన్ ప్రముఖ సినీనటులు పసునూరి శ్రీనివాస్ సిటీ సివిల్ కోర్టు సీనియర్ సూపరిండెంట్ డా పీవీపి అంజనీకుమారి స్పెషల్ పోలీస్ ఆఫీసర్ సినీసింగర్ ప్రేమారెడ్డి ఇందిర ఆర్ట్ ఫౌండేషన్ అధ్యక్షురాలు మెలొడి రొమాంటిక్ సింగర్ డా.యన్ ఇందిర‌ చేతులమీదుగా అందుకున్నారు. ఇదే వేదికపై అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలలో భాగంగా జరిగిన కవిసమ్మేళనములో “నేటి సమాజానికి ఆదర్శమహిళలు” అన్న శీర్షకపై రాగయుక్తంగా తెలుగు పద్యాలను ఆలపించారు. సాహితీ పద్యాలాపన అవార్డును స్వీకరించారు.వివిధ తెలుగు సాహిత్యసేవలకు గుర్తింపుగా డాక్టరేట్ అవార్డు వచ్చినట్లు వెంకట్ తెలిపారు. జాతీయ స్థాయిలో జరిగిన ఈ కార్యక్రమాల్లో-బుడిగె సాహితీ,కొండ్ర తరంగిణి,వేముల రాధారాణి,కామంచి శారద,కే.సుధారాణి,యం.భాగ్యశ్రీ,పి. లక్ష్మీప్రసన్న,ఏ.లావణ్యపటేల్, యం.ఉషారాణి,కే.అమీనా ఆర్,జ్యోతి,కవితా జైన్,బి.మాధురి చౌహాన్,జి‌.బ్రాహ్మణి,బి. వరలక్ష్మీ,కే. విజయ,టీవీ మాణిక్య లక్ష్మీ,కే. వరలక్ష్మీ,పూజాగుప్త,డా.మేడిశెట్టి వెంకటేశ్వర్లు పాల్గొని,వెంకట్ ను అభినందించారు. కాగా వెంకట్ గత 31సంవత్సరాలుగా 1994 నుండి ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాలో సంస్కృతముతో పాటు తెలుగుభాషపై సాహిత్య సేవలను అందించుచున్నారు.సాంస్కృతిక కళా సామాజిక, ఆధ్యాత్మిక ‌పరమైన కార్యక్రమాలను‌ ఇప్పటికి నిర్వహించుచున్నారు.నిర్మల్ జిల్లా తెలంగాణ రచయితల వేదిక, నిర్మలభారతిలకు ప్రధాన కార్యదర్శిగా,కవియాత్రకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా, వ్యాఖ్యాతగా,కొనసాగుతున్నారు ఇప్పటివరకు వెంకట్ 752 అవార్డులను అందుకున్నారు

  • Related Posts

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 17 :- నిర్మల్ జిల్లా భైంసా పట్టణ కేంద్రంలోని మాజీ కౌన్సిలర్ రాజేశ్వర్ ఇటీవల అనారోగ్య కారణంతో స్వర్గస్తులైనారు. విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు జి. విట్టల్ రెడ్డి కుటుంబ సభ్యులను…

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 17 :- ఆశావర్కర్లకు ఉద్యోగ భద్రతతో పాటు సమస్యలు పరిష్కరించాలని మండల కేంద్రమైన ముధోల్ లోని తహసిల్ కార్యాలయంలో తహసిల్దార్ శ్రీకాంత్ కు ఆశావర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్