పది ఏండ్లు అధికారంలో ఉండి చేయలేనివి: పది నెలల్లో మేము చేశాం: సీఎం రేవంత్ రెడ్డి

పది ఏండ్లు అధికారంలో ఉండి చేయలేనివి: పది నెలల్లో మేము చేశాం: సీఎం రేవంత్ రెడ్డి

మనోరంజని ప్రతినిధి

హైదరాబాద్:మార్చి 28
తాము అధికారంలోకి వచ్చాక రైతు భరోసా పథకం కింద రూ.12 వేల కోట్లు చెల్లించామని సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో వెల్లడించారు. ‘ఏక మొత్తం లో రూ. లక్ష రుణమాఫీ చేస్తామని బీఆర్ఎస్ హామీ ఇచ్చింది. కానీ ఎన్నికల య్యాక రుణమాఫీకి ఐదేళ్లు పట్టింది. రెండోసారి రుణమాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు చేయలేదు. పదేళ్లలో 21 లక్షల మంది రైతులకు రూ.16,908 కోట్లు రుణమాఫీ చేశారు.

కానీ మేం 25 లక్షల మంది రైతులకు రూ.20 వేల కోట్లు.. రెండు లక్షల చొప్పున రుణమాఫీ చేశాం.’ అని సీఎం చెప్పారు. వాళ్లు వరి పండించి రూ.4500కు అమ్మకున్నారని, పేద రైతులకు మాత్రం వరేస్తే ఉరే అని ప్రచారం చేశారని రేవంత్ అన్నారు. తమ ప్రభుత్వం వరి వేయమని చెప్పి, బోనస్‌ కూడా ఇచ్చిందని గుర్తు చేశారు.

ఉచిత కరెంట్‌ కనిపెట్టిందే కాంగ్రెస్‌ అని, మీరు పదేళ్లు చేయలేని పనులు పది నెలల్లో చేసి చూపామని కళ్లల్లో నిప్పులు పోసు కుంటున్నారని రేవంత్ మండిపడ్డారు. కాళేశ్వరం లో భారీ అవినీతి బీఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో కమీషన్ల కోసమే ప్రాజెక్టుల ను రీడిజైనింగ్‌ చేశారని రేవంత్ ఆరోపించారు.

రూ.36వేల కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టును పక్కకు పెట్టి.. రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం చేపట్టారన్నారు. కాళేశ్వరం అవినీతి విషయంలో త్వరలోనే వీళ్లు జైలుకు వెళ్తారన్న రేవంత్… కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఏకసభ్య కమిషన్‌ నివేదిక ఇచ్చిందని సభలో వెల్లడించారు.

ప్రాజెక్టుల కోసం పేదల భూములు తీసుకున్న కేసీఆర్‌.. వాళ్ల బంధువుల భూములు మాత్రం తప్పిం చారని రేవంత్‌ విమర్శించా రు. 14 గ్రామాల ప్రజలను పోలీసులతో కొట్టించి బలవంతంగా భూసేకరణ చేశారని అన్నారు. భూములు, ఫామ్‌హౌజ్‌లు ఉన్నాయో నిజనిర్ధారణ కమిటీ వేద్దామా? అని రేవంత్ సవాల్ విసిరారు.

విమర్శలు చేయడమే పనైంది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కృషి చేస్తుంటే, విపక్షాలు విమర్శించడమే తమ పని అయ్యిందని మండిపడ్డారు. “నన్ను మెచ్చుకోవడం ఇష్టం లేకపోతే కనీసం ప్రభుత్వాన్ని అయినా అభినందించండి. అలా చేస్తే మరింత ఉత్సాహంగా పని చేస్తాం,” అని అన్నారు

  • Related Posts

    జాతీయ స్థాయి యోగాలో సత్తాచాటిన రబింద్ర విద్యార్థులు

    జాతీయ స్థాయి యోగాలో సత్తాచాటిన రబింద్ర విద్యార్థులు మనోరంజని ప్రతినిధి ముధోల్ ఏప్రిల్ 09 :- నిర్మల్ జిల్లా ముధోల్. మండల కేంద్రమైన ముధోల్లోని రబింద్ర ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు యోగాసన స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పంజాబ్ లుదియానాకు…

    భైంసా ముద్దుబిడ్డ…సాయికుమార్ పటేల్ విజయగాథ

    భైంసా ముద్దుబిడ్డ…సాయికుమార్ పటేల్ విజయగాథ మనోరంజని ప్రతినిధి భైంసా ఏప్రిల్ 09 :- నిర్మల్ జిల్లా భైంసా పట్టణానికి చెందిన ఎస్. సాయికుమార్ రత్నమాల-పొట్లపల్లి సిద్ధేశ్వర్ పటేల్ కుమారుడు తన పట్టుదల, ఆత్మవిశ్వాసంతో తెలంగాణ రాష్ట్ర గ్రూప్-1 ఫలితాల్లో 157వ ర్యాంకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    జాతీయ స్థాయి యోగాలో సత్తాచాటిన రబింద్ర విద్యార్థులు

    జాతీయ స్థాయి యోగాలో సత్తాచాటిన రబింద్ర విద్యార్థులు

    భైంసా ముద్దుబిడ్డ…సాయికుమార్ పటేల్ విజయగాథ

    భైంసా ముద్దుబిడ్డ…సాయికుమార్ పటేల్ విజయగాథ

    అధైర్యపడొద్దు..అండగా నేనున్నా

    అధైర్యపడొద్దు..అండగా నేనున్నా

    గ్రామాల్లో ఘనంగా అంబలి బార్సి పండుగ

    గ్రామాల్లో ఘనంగా అంబలి బార్సి పండుగ