పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయునికి పంచముఖి ఆంజనేయ ఆలయ కమిటీ సన్మానం

పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయునికి పంచముఖి ఆంజనేయ ఆలయ కమిటీ సన్మానం

మనోరంజని ప్రతినిధి ఆదిలాబాద్ మార్చి 11 :- ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సంజయ్ నగర్ కాలనీలో గత నెల ఉపాధ్యాయ పదవీ విరమణ పొందిన జిల్లెల్ల విలాస్ గౌడ్‌ను సోమవారం సాయంత్రం ఆలయ కమిటీ ఘనంగా సన్మానించింది. పంచముఖి హనుమాన్ ఆలయ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, కాలనీవాసులు, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు విలాస్ గౌడ్‌ను కొనియాడుతూ, ఆయన విద్యారంగంలో అందించిన సేవలను గుర్తు చేశారు. 38 ఏళ్లపాటు ఉపాధ్యాయుడిగా ఎందరో విద్యార్థులను ఉత్తమ స్థాయికి తీసుకెళ్లిన మహోన్నత వ్యక్తి విలాస్ గౌడ్ అని తెలిపారు. అలాగే, ఆయన ఆలయ అభివృద్ధికి అన్నివేళలా సహాయ సహకారాలు అందిస్తూ ఆలయ అడ్వైజరీ కమిటీ మెంబర్‌గా విశేషంగా సేవలు అందించిన విషయాన్ని గుర్తుచేశారు.ఈ సందర్భంగా విలాస్ గౌడ్ మాట్లాడుతూ, భవిష్యత్తులో కూడా పంచముఖి హనుమాన్ ఆలయం, రామాలయం, శివాలయ అభివృద్ధికి తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. సనాతన హిందూ ధర్మాన్ని కాపాడేందుకు అందరూ ఐక్యతగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పంచముఖి హనుమాన్ ఆలయ పంతులు ఘన్షం దేశ్ముఖ్ శర్మ, దిలీప్ దేశ్ముఖ్ శర్మ, ఆలయ కమిటీ అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు, కమిటీ సభ్యులు, కాలనీవాసులు పాల్గొన్నారు

  • Related Posts

    జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌ వేటు అప్రజాస్వామికం

    జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌ వేటు అప్రజాస్వామికం నేడు జిల్లా వ్యాప్తంగా నిరసనలు, దిష్టి బొమ్మల దగ్ధం -పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని జీవన్ రెడ్డి పిలుపు మనోరంజని ప్రతినిధి నిజామాబాద్, మార్చి13 :- బీఆర్ఎస్ ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌…

    వివేకానంద పాఠశాలలో హోలీ సంబరాలు .

    వివేకానంద పాఠశాలలో హోలీ సంబరాలు . మనోరంజని ప్రతినిధినిర్మల్ జిల్లా – సారంగాపూర్: మార్చి 13 :-నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలోని వివేకానంద స్కూల్‌లో గురువారం హోలీ పండుగ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. విద్యార్థులు రంగులు చల్లుకుంటూ ఆనందంగా పాల్గొన్నారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఈ నెలలో రెండు గ్రహణాలు

    ఈ నెలలో రెండు గ్రహణాలు

    వందేభారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్

    వందేభారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్

    జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌ వేటు అప్రజాస్వామికం

    జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌ వేటు అప్రజాస్వామికం

    వివేకానంద పాఠశాలలో హోలీ సంబరాలు .

    వివేకానంద పాఠశాలలో హోలీ సంబరాలు .

    గుండెపోటుకు చైనా వ్యాక్సిన్!

    గుండెపోటుకు చైనా వ్యాక్సిన్!

    సినీ నటి జెత్వానీ కేసు… ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ పొడిగింపు

    సినీ నటి జెత్వానీ కేసు… ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ పొడిగింపు