

పంట మేతకు.. అప్పులు రైతుకు..
కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి అయోమయం…
నీళ్ల కొరతతో సాగని సాగు..
రైతు భరోసా సాయం అందక భారమైన అప్పులు
మెతుకుల కోసం వరి వేస్తే ఎండిపోయి పశువుల మేతకు వదలాల్సిన దుస్థితి
వికారాబాద్ జిల్లాలో 5000 ఎకరాలపైనే ఎండుముఖం పట్టినట్లు అంచనా
ఈనెలాఖరు వరకు మరింత పెరిగే అవకాశం
రోజురోజుకూ తగ్గుతున్న బోర్లలో నీటినిల్వల శాతం
ఏప్రిల్ నెలలో బోర్లలో నీటి నిల్వలు తగ్గితే సాగైన వరిలో70 శాతానికిపైగా నష్టపోనున్న రైతులు !
ప్రభుత్వం ఆదుకోవాలని వినతి
గతంలో ఎన్నడూలేని విధంగా వికారాబాద్ జిల్లాలో భూగర్భజలాలు తగ్గడంతో భూములు నెర్రెలు తేలి ఎండుముఖం పట్టాయి. అప్పులు తెచ్చి సాగు చేసిన పంట ఎండుతుండడంతో అన్నదాత పుట్టేడు దుఃఖంలో ఉన్నాడు. జిల్లాలో ఇప్పటివరకు దాదాపుగా 5,000 ఎకరాల వరకు వరి ఎండుముఖం పట్టినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అత్యధికంగా కులకచర్ల, దౌల్తాబాద్, బొంరాస్‌పేట మండలాల్లో ఉన్నట్లు పేర్కొంటున్నారు. ఎండిన పంటను అన్నదాతలు మేతకు వదిలేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
యాసంగి కాలం జిల్లా రైతాంగానికి కష్టకాలమైపోయింది. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన వరి పంట నష్టాలనే మిగిల్చేలా ఉన్నది. అప్పులు తెచ్చి సాగు చేసిన పంట ఎండుముఖం పట్టడంతో పుట్టెడు దుఃఖంలో ఉన్నారు అన్నదాతలు. గతంలో ఎన్నడూలేని విధంగా భూగర్భజలాలు తగ్గడంతో ఎండుముఖం పట్టింది. భూములు నీరులేక నెర్రెలు తేలిన దయనీయ పరిస్థితి నెలకొన్నది. అయితే, జిల్లాలో ఇప్పటివరకు దాదాపుగా 5,000 ఎకరాల వరకు వరి ఎండుముఖం పట్టినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అత్యధికంగా కులకచర్ల, దౌల్తాబా ద్, బొంరాస్‌పేట మండలాల్లో ఎండినట్లు అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ మా సం లో బోర్లలో నీటి నిల్వల శాతం తగ్గిపోతే జిల్లాలో సాగు చేసిన వరి పం టలో 70 శాతానికిపైగా ఎండిపో యే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్న ది. ఇప్పటికే ఎండల తీవ్రత అధికమైన దృష్ట్యా ఏప్రిల్‌లో మరింత ఎండలు ముదరనున్న నేపథ్యంలో భూగర్భజలాలు మరింత అడుగంటిపోయే పరిస్థితి నెలకొన్నది. ప్రస్తు తం ఎండ తీవ్రత 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతుండగా, ఏప్రిల్‌లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతకు మించి నమోదయ్యే అవకాశాలున్నాయ ని.. ఈ దృష్ట్యా వరి పంటపై నీలినీడలు కమ్ముకున్నట్లేనని తెలుస్తున్న ది. మరోవైపు ఎండుముఖం పట్టిన వరి పంటను కొందరు రైతులు పశువులకు మేత కోసం వదులుతున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
90,814 ఎకరాల్లో వరి సాగు..
జిల్లాలో యాసంగిలో 90,814 ఎకరాల్లో వరి పంటను రైతులు సాగు చేశారు. అత్యధికంగా దౌల్తాబాద్ మండలం లో 14,449 ఎకరాలు, దోమ మండలంలో 12,120, యాలాలలో 10,850, బొంరాస్‌పేటలో 9650, కొడంగల్ లో 5162, కులకచర్లలో 5450, పరిగిలో 5487, తాండూరు లో 4215, ధారూరులో 4623, బషీరాబాద్‌లో 3980, పెద్దేముల్లో 3395, దుద్యాలలో 8688, మోమిన్‌పేటలో 468, కోట్‌పల్లిలో 61, మర్పల్లిలో 25, నవాబుపేటలో 95, వికారాబాద్‌లో 156, పూడూరులో 90, చౌడాపూర్ మండలంలో 1850 ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. అయితే,ఈ సాగైన పంటలో సుమారు 5,000 ఎకరాల వరకు ఎండుముఖం పట్టినట్లు క్షేత్రస్థాయిలో పరిస్థితిని చూస్తే అర్థమవు తున్నది. జిల్లాలో మెజార్టీ భాగం బోర్లపైనే ఆధారపడి సాగు చేయగా.. ఏప్రిల్ రెండో వారం వరకు బోర్లలో నీటి నిల్వలు తగ్గకుంటే పంట చేతికొచ్చే అవకాశాలున్నాయి.. లేదంటే సాగు చేసిన దానిలో 70 శాతానికిపైగా నష్టపోనున్నారు.
అడుగంటుతున్న భూగర్భజలాలు
బీఆర్ఎస్ హయాంలో చెరువుల పూడికతీత పనులతో తటాకాల్లో నీటి నిల్వలు సమృద్ధిగా ఉండడంతో భూగర్భజలాలకు ఎలాంటి ప్రమాదం లేకుండే.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను పూర్తిగా నట్టేట ముంచిన రేవంత్ ప్రభుత్వం చెరువుల పూడికతీత పనులను గాలికి వదిలేసింది. దీంతో జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులతోపాటు మెజార్టీ చెరువుల్లో రోజురోజుకూ నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. ఎండల తీవ్రత పెరిగిన దృష్ట్యా ఈనెలాఖరు నాటికి ప్రాజెక్టులతోపాటు చెరువుల్లోనూ 50 శాతానికిపైగా నీటి నిల్వలు తగ్గే అవకాశం ఉన్నట్లు సంబంధిత అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, జిల్లాలో భూగర్భజలాలు రోజురోజుకూ అడుగంటిపోతున్నాయి. ఫిబ్రవరి చివరి నాటికి 13.58 మీటర్ల లోతుకు అడుగంటిపోయాయి. గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరి చివరి నాటికి .37 మీటర్ల మేర నీటి నిల్వలు తగ్గాయి. అయితే ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి మరీ దారుణంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
వికారాబాద్ మండలంలోని మైలార్‌దేవ్‌పల్లిలో 42.98 మీటర్లకు, దు ద్యాల మండలంలో సగటున 29.88 మీటర్లు, మర్పల్లి మండలంలో 22.39 మీటర్ల లోతుకు, మర్పల్లి మండలంలోని నర్సాపూర్‌లో 32.56 మీటర్లకు, నవాబ్‌పేట మండలంలోని మాదిరెడ్డిపల్లిలో 21.28 మీటర్లకు, దోమ మండలంలోని దిర్సంపల్లిలో 17.25 మీటర్లకు, దోమ లో 14.25 మీటర్లకు, యాలాల మండలంలోని దేవనూర్లో 28.98 మీటర్లకు, ధారూరు మండలంలోని అంతారంలో 16.42 మీటర్లకు, కో ట్పల్లిలో 14.56 మీటర్లకు, కులకచర్ల మండలంలోని ముజాహిద్‌పూర్‌లో 15.32 మీటర్లకు, పరిగి మండలంలోని రంగంపల్లిలో 42.35 మీటర్లకు, తాండూరు మండలంలోని ఉద్దండాపూర్‌లో 29.42 మీటర్లకు, జిన్‌గుర్తిలో 19.48 మీటర్లకు, కొడంగల్ మండలంలోని రుద్రారంలో 15.46 మీటర్లకు భూగర్భజలాలు చేరాయి.
అప్పులు తెచ్చి.. పంటల సాగు..
భూగర్భజలాలు పూర్తిగా తగ్గిపోయాయి. వరి నీరు అందక ఎండిపో తున్నది. అప్పులు చేసి పంటను సాగు చేశా. రైతు భరో సా కూడా రాక పోవడంతో ఇబ్బందిగా ఉన్నది. ప్రభుత్వం స్పందించి పరిహారం చెల్లించి ఆదుకోవాలి.
-వెంకటయ్య, రైతు చెల్లాపూర్, కులకచర్ల
ప్రభుత్వం ఆదుకోవాలి
నేను మూడు ఎకరాల్లో వరి పంటను సాగు చేశా. బోరు నుంచి నీరు రాకపోవడంతో పంట ఎండిపోతున్నది. ప్రభుత్వం స్పం దించి కోట్‌పల్లి ప్రాజెక్టు నుంచి నీటిని వదిలి ఆదుకోవాలి.
-సుక్క చంద్రయ్య, జనగాం, పెద్దేముల్
పశువుల మేతకే..
వేసిన పంటలు ఎండిపోతున్నాయి. తాను ఎకరం పొలంలో వరిని సాగు చేశా. ఉన్న ఒక్క బోరు నుంచి నీరు రాకపోవడం తో ఎకరం పొలం ఎం డి పోతుంది. ఇక ఆ పంట పశువుల మేతకే వాదాల్సి న దుస్థితి నెలకొన్నది. పంట సాగుకు చేసిన అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావడంలేదు.
-గోపాల్‌రెడ్డి, రైతు పుట్టపహాడ్ గ్రామం, కులకచర్ల