నేడు స్టేషన్‌ఘన్‌పూర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి..!!

నేడు స్టేషన్‌ఘన్‌పూర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి..!!

.800 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

స్వయం సహాయక సంఘాలకు రూ.100 కోట్ల రుణాల పంపిణీ

అనంతరం కృతజ్ఞత సభలో ప్రసంగించనున్న సీఎం

ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా భారీగా ఏర్పాట్లు

వరంగల్‌: ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఆదివారం జనగామ జిల్లాలో పర్యటించనున్నారు. సుమారు రూ.800 కోట్ల విలువైన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం శివునిపల్లి వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు సీఎం చేరుకుంటారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఇందిర మహిళా శక్తి స్టాళ్లను సందర్శిస్తారు.

ప్రజాపాలన కార్యక్రమాల్లో భాగంగా మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.100 కోట్ల మేర బ్యాంకు లింకేజీ రుణాల చెక్కులను అందజేస్తారు. రూ.700 కోట్ల విలువైన పనులను సీఎం వర్చువల్‌గా ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. అనంతరం డివిజన్‌ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ సమీపంలో నిర్వహించే కృతజ్ఞత సభలో పాల్గొంటారు.

సీఎం పర్యటన సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు ఐదు రోజులుగా స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య, కలెక్టర్‌ షేక్‌ రిజ్వాన్‌బాషా, వరంగల్‌ పోలీసు కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ తదితరులు శనివారం బహిరంగ సభతోపాటు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంబోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు.

సీఎం టూర్‌ షెడ్యూల్‌ ఇలా..
» మధ్యాహ్నం 12.10 గంటలకు ఇంటినుంచి (హైదరాబాద్‌లో) బయలుదేరి బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు.
» 12.25 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరుతారు.
» మధ్యాహ్నం 1 గంటకు స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం శివునిపల్లె హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.
» 1.10 నుంచి 1.20 గంటల వరకు ఇందిర మహిళాశక్తి స్టాళ్లను పరిశీలించి, వివిధ సంఘాలకు కేటాయించిన బస్సులను ప్రారంభిస్తారు.
» 1.25 నుంచి 3 గంట లవరకు శివుని పల్లె లో ప్రజాపాలన కా ర్యక్రమాలు, కృతజ్ఞత సభలో పాల్గొంటారు.
» 3.10 గంటలకు శివునిపల్లె హెలిప్యాడ్‌ నుంచి బయలుదేరి 3.45 గంటలకు హెలి కాప్టర్‌లో హైదరా బాద్‌ చేరుకుంటారు.

  • Related Posts

    పౌరసరఫరాల శాఖ మేనేజర్ శాలువతో సన్మానించిన అబ్దుల్ అజీం..

    పౌరసరఫరాల శాఖ మేనేజర్ శాలువతో సన్మానించిన అబ్దుల్ అజీం.. మనోరంజని,నిజామాబాద్ ప్రతినిధి:: పౌర సరఫరాల శాఖ నిజామాబాద్ జిల్లా మేనేజర్ శ్రీకాంత్ రెడ్డిని ఆర్మూర్ మండల రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు అబ్దుల్ అజీమ్ నాయకులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ మేరకు…

    చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు?

    చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు? మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 17 – రాజకీయాలు కలుషిత మయ్యాయో రాజకీయ నాయకుల ఆలోచనలు కలుషితమయ్యాయో తెలియడం లేదని, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    పౌరసరఫరాల శాఖ మేనేజర్ శాలువతో సన్మానించిన అబ్దుల్ అజీం..

    పౌరసరఫరాల శాఖ మేనేజర్ శాలువతో సన్మానించిన అబ్దుల్ అజీం..

    చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు?

    చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు?

    తెలంగాణ సిఫార్సు లేఖలకు టీటీడీ ఆమోదం

    తెలంగాణ సిఫార్సు లేఖలకు టీటీడీ ఆమోదం

    ట్రస్టు సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

    ట్రస్టు సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలి.