నేడు కొమురవెల్లి మల్లన్న ముగింపు బ్రహ్మాత్సవాలు

నేడు కొమురవెల్లి మల్లన్న ముగింపు బ్రహ్మాత్సవాలు

భారీగా తరలివచ్చిన భక్తులు

మనోరంజని ప్రతినిధి సిద్దిపేట జిల్లా: మార్చి 24 – కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. స్వామి వారి బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. చివరి ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆలయ ప్రాంగణం తోటబావి వద్ద అగ్ని గుండాలను నిర్వహించారు. వీరశైవ ఆగమ శాస్త్రం ప్రకారం స్వామివారి ఆలయంలో పూజలు నిర్వహించి సోమవారం తెల్లవారు జామున ఉత్సవ విగ్రహాలు తీసుకువచ్చి అగ్నిగుండాల వద్ద పెట్టి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ విగ్రహాలను పట్టు కుని అగ్నిగుండాలు దాటిన తర్వాత.. భక్తులు అగ్నిగుం డాలు దాటి తమ మొక్కు లు చెల్లించుకున్నారు. దీంతో మూడు నెలలుగా సాగుతున్న బ్రహ్మోత్స వాలు అగ్నిగుండాల కార్య క్రమంతో జాతర ముగిసిం ది. కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు జనవరి 19న ప్రారంభమయ్యాయి. దాదాపు మూడు నెలల పాటు సాగిన జాతర ఉత్స వాలు ఉగాదికి ముందు వచ్చే ఆదివారంతో ముగుస్తాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఆదివారం ఆలయంలో విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు బోనాలతో ఆలయానికి వెళ్లి స్వామి, అమ్మవార్లకు నైవేద్యం సమర్పించు కుంటారు. పట్నం వేసి కల్యాణం జరిపించి మొక్కులు తీర్చుకున్నారు. పట్నం వారంతో ఉత్సవాలు ప్రారంభమై 10 ఆదివారా లు కొనసాగాయి. 10 ఆదివారాలతోపాటు ప్రత్యేక కార్యక్రమాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. చివరి వారం కావడంతో భక్తులు స్వామి వారి క్షేత్రా నికి భారీగా చేరుకున్నారు. వేకువజాము నుంచే భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి అగ్ని గుండాల మీదుగా నడిచి వెళ్లి స్వామి వారి దర్శనం చేసుకున్నా రు. క్యూలైన్లలో గంటల పాటు వేచి ఉన్నారు. స్వామి వారి దర్శనానికి 3 నుంచి 5 గంటల సమయం పట్టింది. గుట్టపై భాగంలో ఉన్న ఎల్లమ్మకు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు

  • Related Posts

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి పూజా హెగ్డే

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి పూజా హెగ్డే మనోరంజని ప్రతినిధి తిరుపతి జిల్లా : ఏప్రిల్ 04 :-తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి,వారిని టాలీవుడ్ స్టార్‌ నటి పూజా హెగ్డే ఈరోజు ఉదయం దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ…

    రాములవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే

    కామోల్ లో ప్రారంభమైన శ్రీరామనవమి ఉత్సవాలు మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 30 :- నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని కామోల్ గ్రామంలో సీతారామచంద్రస్వామి ఆలయంలో ఉగాది పర్వదిన వేళ శ్రీరామనవమి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆలయంలో తొమ్మిది రోజులపాటు ప్రత్యేక వేడుకలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    వక్ఫ్ బిల్లు ఆమోదంపై మోడీ కీలక వ్యాఖ్యలు

    వక్ఫ్ బిల్లు ఆమోదంపై మోడీ కీలక వ్యాఖ్యలు

    బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారుడు యూనస్‌తో ప్రధాని మోదీ భేటీ

    బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారుడు యూనస్‌తో ప్రధాని మోదీ భేటీ

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి పూజా హెగ్డే

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి పూజా హెగ్డే

    శ్రీరామనవమి శోభా యాత్ర సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై…

    శ్రీరామనవమి శోభా యాత్ర సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై…