నేడు అసెంబ్లీలో కీలక బిల్లు

నేడు అసెంబ్లీలో కీలక బిల్లు

ప్రవేశపెట్టనున్న సీఎం రేవంత్ రెడ్డి

మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 15 – మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి ఢిల్లీ పర్యటన ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి సభకు రానున్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సమాధానం ఇవ్వనున్నారు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు త్వరలో మారనుంది. ప్రముఖ కవి, ఉద్యమ కారుడు, పరిశోధకుడు, తెలంగాణ వైతాళికుడిగా పేరుపొందిన సురవరం ప్రతాప్‌రెడ్డి పేరును ఈ విశ్వవిద్యాలయానికి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని అధికారి కంగా అమలు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేడు అసెంబ్లీలో చట్ట సవ రణ బిల్లు ప్రవేశపెట్టనున్నా రు. ఈ చట్ట సవరణతో.. సురవరం ప్రతాప్‌రెడ్డి పేరు విశ్వవిద్యాలయానికి అధి కారికంగా ఇవ్వబడుతుంది. గత సెప్టెంబరు 20న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం, విద్యా రంగంలో ఒక గొప్ప మార్పును సూచిస్తుంది. ఆ సమయంలో మంత్రివర్గ సభ్యులు సురవరంకి ఇచ్చిన గౌరవం.. రాష్ట్ర విద్యా రంగానికి కొత్త దిశను సృష్టించగలదని అంచనా వేయబడింది. అయితే.. ఈ విశ్వవిద్యా లయం పదో షెడ్యూల్‌లో ఉన్నందున ఇప్పటివరకు పేరు మార్చడం ఆలస్యం అయ్యింది. ఇక తెలంగాణ రాష్ట్ర విభజనకు పదేళ్ల సమయం పూర్తయిన సందర్భంగా.. ఈ మార్పు ను ప్రతిపాదించడం, రాష్ట్ర వృత్తి విద్యాసంస్థలకు కొత్త గుర్తింపు ఇవ్వాలని ప్రభు త్వం భావిస్తోంది.

  • Related Posts

    విద్యుత్ బకాయిలను విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ను కోరిన ➖ కోలిపాక లక్ష్మణ్

    విద్యుత్ బకాయిలను విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ను కోరిన ➖ కోలిపాక లక్ష్మణ్

    సోషల్ మీడియా కోఆర్డినేటర్ ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

    సోషల్ మీడియా కోఆర్డినేటర్ ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రామడుగు మండలం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జవ్వాజి అజయ్ ఇటీవల బైక్ నుండి కింద పడగా కాలు కీ గాయం కాగా ఆదివారం రోజున రామడుగు మండలం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    అమెరికాలో రోడ్డు ప్రమాదం

    అమెరికాలో రోడ్డు ప్రమాదం

    ఏపీలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు

    ఏపీలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు

    విద్యుత్ బకాయిలను విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ను కోరిన ➖ కోలిపాక లక్ష్మణ్

    విద్యుత్ బకాయిలను విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ను కోరిన ➖ కోలిపాక లక్ష్మణ్

    బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో దారుణం

    బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో దారుణం