నీటి సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తా

నీటి సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తా

పంచాయతీ కార్యదర్శి అన్వర్ అలీ

మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 12 :-వేసవికాలంలో ప్రజలకు నీటి సమస్యను తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని పంచాయతీ కార్యదర్శి అన్వర్ అలీ అన్నారు. బుధవారం మండల కేంద్రమైన ముధోల్ లోని ఎస్సీ కాలనీలో నీటి కనెక్షన్ ను మినీ వాటర్ ట్యాంక్ కు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటిని వృధా కాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఇప్పటికే వార్డుల వారీగా నీటి వృధాను గుర్తించడం జరిగిందన్నారు. సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. నీటి వృధాను అరికట్టేందుకు అవసరమైన చర్యలు సైతం తీసుకుంటున్నామని వెల్లడించారు. ప్రజలు సైతం తమ వార్డు పరిధిలో నీటి సమస్య తలెత్తితే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. ఇప్పటికే వేసవికాలంలో త్రాగునీటి సమస్యను తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవడంలో భాగంగా ఎంపీడీవో శివకుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక గ్రామసభను ఏర్పాటు చేసి స్థానికుల అభిప్రాయాలను తీసుకోవడం జరిగిందన్నారు. పారిశుద్ధ్యం-త్రాగునీటి సమస్య -వీధి దీపాల- నిర్వహణ తో పాటు ఇంటింటి నుండి చెత్తను సేకరించే పనులను సక్రమంగా చేపట్టే విధంగా చూస్తున్నామన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలవకుండా అన్ని రకాలుగా ముందుకు వెళ్తున్నామని వివరించారు

  • Related Posts

    మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : గ్రంధాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

    మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : గ్రంధాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి మనోరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 13 :మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి అని రంగారెడ్డి జిల్లా చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా…

    జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌ వేటు అప్రజాస్వామికం

    జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌ వేటు అప్రజాస్వామికం నేడు జిల్లా వ్యాప్తంగా నిరసనలు, దిష్టి బొమ్మల దగ్ధం -పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని జీవన్ రెడ్డి పిలుపు మనోరంజని ప్రతినిధి నిజామాబాద్, మార్చి13 :- బీఆర్ఎస్ ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    దేశ వ్యాప్తంగా 5G సర్వీసు’

    దేశ వ్యాప్తంగా 5G సర్వీసు’

    మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : గ్రంధాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

    మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : గ్రంధాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

    ఈ నెలలో రెండు గ్రహణాలు

    ఈ నెలలో రెండు గ్రహణాలు

    వందేభారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్

    వందేభారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్