

నీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక చర్యలు
ముధోల్ ఎంపీడీవో శివకుమార్
మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 07 :- వేసవికాలంలో ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని ముధోల్ ఎంపీడీవో శివకుమార్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన ముధోల్లోని గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో వేసవికాలంలో ప్రజలకు త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా తీసుకోవలసిన చర్యలపై ప్రత్యేక గ్రామ సభను ఏర్పాటు చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వెల్లడించారు. ముఖ్యంగా యుద్ధ ప్రాతిపదికన బోర్ల రిపేర్ తో పాటు మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరాను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. ప్రజలు సైతం ఎప్పటికప్పుడు సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులు త్రాగునీటి సమస్య నివారణలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తగిన సలహాలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అన్వర్ అలీ, బిజెపి మండల అధ్యక్షుడు కోరిపోతన్న, మాజీ ఎంపీటీసీ సభ్యుడు దేవోజి భూమేష్, నాయకులు తాటివార్ రమేష్, ఎమ్ఏ అజీజ్, స్థానికులు, తదితరులు పాల్గొన్నారు