దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీలక పిలుపు..!!

దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీలక పిలుపు..!!

దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) కీలక పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. ముందుగా దేశ ప్రజలకు ఉగాది(Ugadi 2025) పండుగ శుభాకాంక్షలు చెప్పారు. వసంత కాలంలో జరుపుకునే ఈ నూతన సంవత్సర పండుగ దేశంలోని సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపారు. ఈ పర్వదినం సందర్భంగా ప్రజలంతా సామరస్యం, సమగ్రతను చాటి దేశ గౌరవాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా.. కాసేపటి క్రితమే తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. రైతన్నలు తమ వ్యవసాయ పనులను ఉగాది నుండి కొత్తగా ప్రారంభిస్తారని, వ్యవసాయ నామ సంవత్సరంగా ఉగాది నిలుస్తుందన్నారు. ప్రకృతితో మమేకమై, వ్యవసాయ ఉత్పత్తి సంబంధాలలో పరస్పర సహకారం ప్రేమాభిమానాలతో పాల్గొనే సబ్బండ వర్ణాలకు, ఉగాది గొప్ప పర్వదినం అని అన్నారు. ప్రజల శ్రామిక సాంస్కృతిక జీవనంలో, ఆది పండుగగా ఉగాదికి ప్రత్యేక స్థానం ఉన్నదన్నారు. చెట్లు పచ్చగా చిగురిస్తూ, ప్రకృతి మాత నూతనోత్సాహాన్ని సంతరించుకుంటుందని, అదే నూతనోత్సాహం ప్రజల జీవితాల్లో నిండాలని వారు కోరుకున్నారు

  • Related Posts

    గ్రోక్‌ చెప్పిన ‘పంచాంగం

    గ్రోక్‌ చెప్పిన ‘పంచాంగం ”అప్పు పుట్టింది బిడ్డా.. అంటే కొంప మునిగింది కొడుకా..” అన్నట్టుగా ఉంది దేశ ఆర్థిక పరిస్థితి. మొన్న ఉగాది పండగ నాడు కేంద్ర ప్రభుత్వానికి రాశిఫలితాలు ఎవరు చెప్పినట్టు లేరు. కానీ, కాస్త ఆలస్యంగా నైనా ఏఐ…

    గత 11 ఏళ్లలో మోడీ ప్రభుత్వానికి గర్వించదగిన అతిపెద్ద సాధన వక్ఫ్ సవరణ చట్టం

    గత 11 ఏళ్లలో మోడీ ప్రభుత్వానికి గర్వించదగిన అతిపెద్ద సాధన వక్ఫ్ సవరణ చట్టం (Waqf Amendment Act) అనే చెప్పాలి. నిజం చెప్పాలంటే, ఆర్టికల్ 370 రద్దు, రామ మందిర నిర్మాణం, సర్జికల్ స్ట్రైక్స్ కన్నా కూడా దీన్ని పైస్థాయిలో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    సంపన్నులతో సమానంగా పేదలకు సన్నబియ్యం పథకం

    సంపన్నులతో సమానంగా పేదలకు సన్నబియ్యం పథకం

    అధికారులు.. ఉన్న లేనట్టేనా..?

    అధికారులు.. ఉన్న లేనట్టేనా..?

    అంబేద్కర్ జయంతి వేడుకలకు బీఎస్పీ నేత విరాళం :

    అంబేద్కర్ జయంతి వేడుకలకు బీఎస్పీ నేత విరాళం :

    యువత ప్రాణాలు తీస్తున్న బెట్టింగ్ యాప్స్

    యువత ప్రాణాలు తీస్తున్న బెట్టింగ్ యాప్స్