దేవాలయాల భూములను పరిరక్షించండి

దేవాలయాల భూములను పరిరక్షించండి

   *వందల ఎకరాల భూములు కబ్జా గురయ్యాయి*

 *శాసనసభలో ఎమ్మెల్యే పవార్ రామరావు పటేల్*

మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 26 :- రాష్ట్రంలో దేవాలయాలకు సంబంధించిన భూములు కబ్జాకో రల్లో చిక్కుకున్నాయని, కొందరు రియల్టర్లు వందలాది ఎకరాల భూములను ప్లాట్లుగా మార్చేశారని, ప్రభుత్వం వీటి విషయంలో చొరవ చూపాలని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. శాసనసభలో ఆయన దేవాలయాల భూముల అంశంపై మాట్లాడారు. స్వయంభు హనుమాన్ టెంపుల్ బాలాపూర్ లో 30 ఎకరాల భూమిని కబ్జా చేసి ప్లాట్లుగా మార్చేశారన్నారు. శాలిబండలో జగన్నాథ స్వామి టెంపుల్, మామిడిపల్లిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ కు సంబంధించిన 33 ఎకరాల భూమి కబ్జా చేశారన్నారు. కాళికామాత టెంపుల్ ఎనిమిద ఎకరాలు, అదిలాబాద్ లో వెంకటేశ్వర స్వామి, గోపాలకృష్ణ మందిరానికి సంబంధించిన 250 ఎకరాల భూమి కబ్జా అయిందని, శ్రీ రామచంద్రస్వామి ఆలయ భూములు వెయ్యి ఎకరాలు కబ్జా కో రల్లో చిక్కుకున్నాయన్నారు. బోధనలో మారుతి టెంపుల్, శ్రీ రామస్వామి టెంపుల్, మహబూబాబాద్ లో మహా గాయత్రి మందిర భూములు కబ్జా చేశారన్నారు. ఆలయ భూముల పరిరక్షణ పట్ల ప్రభుత్వాలు దృష్టి పెట్టడం లేదన్నారు. ఇకనైనా కోట్లాది రూపాయల విలువైన దేవాలయాల భూములను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
బాసరలో ఆలయ పుణ్య నిర్మాణం చేపట్టండి
బాసర అమ్మవారి క్షేత్రంలో వెనక్కి మళ్లించిన నిధులు 48 కోట్లు ఇచ్చి తక్షణం ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభించాలని ఎమ్మెల్యే మరోమారు శాసనసభలో కోరారు. దేశంలోనే ప్రసిద్ధిగాంచిన జ్ఞాన సరస్వతి ఆలయ అభివృద్ధి పట్ల ఇంత నిర్లక్ష్యం ఎందుకు అన్నారు. త్వరలో గోదావరి పుష్కరాలు రానున్నాయని ఆలయ అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. ఈసారి బడ్జెట్లో బాసర అమ్మవారి సన్నిధిలో గోదావరమ్మకు ప్రతినిత్యం హారతి చేస్తామని ప్రకటించడం సరికాదన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఆలయం ద్వారా ప్రతివారం గంగా హారతి చేపడుతున్నారని, అదే విధంగా వేద భారతి విద్యాపీఠం ద్వారా గత కొన్ని సంవత్సరాలుగా నిత్యారతి కొనసాగుతుందని గుర్తు చేశారు.

  • Related Posts

    ఆర్థిక సహాయాన్ని అందజేసిన

    జంగరాయి గ్రామానికి చెందిన చిన్నంగల భారతమ్మ అనారోగ్యంతో మృతి చెందారని తెలుసుకొని ఆర్థిక సహాయాన్ని అందజేసిన లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ మనోరంజని వెల్దుర్తి మాసాయిపేట ప్రతినిధి ఏప్రిల్ 4- మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం జంగారాయి…

    శ్రీరామనవమి శోభా యాత్ర సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై…

    శ్రీరామనవమి శోభా యాత్ర సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై… ఇతర వర్గాలను కించపరిచే పాటలు, ప్రసంగాలు వద్దు మనోరంజని ప్రతినిధి హైదరాబాద్‌ సిటీ: ఏప్రిల్ 04 :-నగరంలో నిర్వహించే శ్రీరామ నవమి శోభాయాత్రకు దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉందని, శోభాయాత్రను శాంతియుతంగా, ప్రశాంతంగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఆర్థిక సహాయాన్ని అందజేసిన

    ఆర్థిక సహాయాన్ని అందజేసిన

    వక్ఫ్ బిల్లు ఆమోదంపై మోడీ కీలక వ్యాఖ్యలు

    వక్ఫ్ బిల్లు ఆమోదంపై మోడీ కీలక వ్యాఖ్యలు

    బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారుడు యూనస్‌తో ప్రధాని మోదీ భేటీ

    బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారుడు యూనస్‌తో ప్రధాని మోదీ భేటీ

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి పూజా హెగ్డే

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి పూజా హెగ్డే