తెలంగాణ జిల్లాలో మండుతున్న ఎండలు!

తెలంగాణ జిల్లాలో మండుతున్న ఎండలు!

మనోరంజని ప్రతినిధి

హైదరాబాద్:మార్చి 28
తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా ఎండల తీవ్రత పెరుగుతుంది. దీని ప్రభావంతో వడ గాలుల వీస్తున్నాయి. ఇక, నేడు తెలంగాణలోని 15 జిల్లాలకు హైదరాబాద్ లోని వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు.

ఆదిలాబాద్, కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, ఖమ్మం, కొమరంభీం, మంచిర్యాల, ములుగు, నాగర్ కర్నూల్, నారాయణపేట్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, వనపర్తి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ హెచ్చరికలు జారీ చేశారు.

అయితే, ఇప్పటికే తెలం గాణ రాష్ట్రంలో గరిష్టంగా 41 డిగ్రీలు ఉష్ణోగ్రతలు దాటి పోతున్నాయి. నేటి నుంచి మరింతగా ఉష్ణోగ్ర తలు పెరగనున్నాయని చెప్పుకొచ్చారు. అలాగే, ఉత్తర తెలంగాణలోని పలు జిలాల్లో 45 డిగ్రీల వరకు టెంపరేచర్స్ నమోదయ్యే అవకాశం ఉంది.

అయితే, ప్రజలు మధ్యా హ్నం సమయంలో బయటికి రావొద్దని వాతావ రణ శాఖ అధికారులు సూచించారు. అవసరం అయితేనే తప్పా ఇంటి నుంచి బయటకు రావొద్ద న్నారు. బయటకు వెళ్ళిన ప్పుడు టోపీ, గొడుగులు లాంటివి ఉపయోగించాలని హెచ్చరించారు.

కాగా, ఈ రోజు నుంచి మరో మూడు రోజుల పాటు మరింత ఎండ వేడిమి పెరిగే ఛాన్స్ ఉంది.. మరో ఐదు రోజుల పాటు రాష్ట్రం లో పొడి వాతావరణం నెలకొంటుందని హైదరాబా ద్ లోని వాతావరణ కేంద్రం చెప్పింది.

  • Related Posts

    వెంకటేశ్వర ఎస్సీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 25 కిలోల బియ్యం అందజేత

    వెంకటేశ్వర ఎస్సీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 25 కిలోల బియ్యం అందజేత *మనోరంజని మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి ఏప్రిల్ 10 :- భీమారం మండలంలో కేంద్రం లోని సుంకరిపల్లి వాడకు చెందిన జుమ్మిడి తిరుపతి అనారోగ్యం కారణంగా మరణించారు..…

    లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేసి సాగునీరు తాగునీరు అందించాలి.

    లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేసి సాగునీరు తాగునీరు అందించాలి. బిఆర్ఎస్ నాయకుడు రాజ్ కుమార్. *మనోరంజని మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి. ఏప్రిల్ 10 :- చెన్నూర్ నియోజకవర్గం లోని భీమారం మండల కేంద్రం లో గల గొల్ల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    వెంకటేశ్వర ఎస్సీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 25 కిలోల బియ్యం అందజేత

    వెంకటేశ్వర ఎస్సీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 25 కిలోల బియ్యం అందజేత

    లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేసి సాగునీరు తాగునీరు అందించాలి.

    లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేసి సాగునీరు తాగునీరు అందించాలి.

    ఆలయాల నిర్మాణానికి ప్రభుత్వ ఆమోదం

    ఆలయాల నిర్మాణానికి ప్రభుత్వ ఆమోదం

    చుక్కాపూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం

    చుక్కాపూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం