తుపాకుల కాల్పులతో మరోసారి దద్దరిల్లిన దండకారణ్యం

తుపాకుల కాల్పులతో మరోసారి దద్దరిల్లిన దండకారణ్యం

మనోరంజని ప్రతినిధి చత్తీస్ ఘడ్:మార్చి 20 – దండకారణ్యంలో మరో సారి తుపాకి కాల్పులతో దద్దరిల్లింది, ఒకే రోజు బీజాపూర్ జిల్లా కాంకేర్ జిల్లాలో వేరు వేరు జరిగిన ఎన్కౌంటర్ లో 22 మంది మావోయిస్టులు మృతి చెందారు. అయితే ఈ ఎదురు కాల్పుల్లో ఓ జవాన్ కూడా మృతి చెందినట్లు అధికారులు తొలగించారు. సంఘటన స్థలంలో భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా రిజర్వ్ గార్డ్​కు చెందిన ఒక జవాను మృతి చెందినట్లు అధికారు లు తెలిపారు. బీజాపూర్ జిల్లా గంగలూరు ప్రాంతంలో పెద్దఎత్తున మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో గురువారం ఉదయం నుండి భద్రతా బలగాలు అడవుల్లో కూంబింగ్ నిర్వహించాయి. ఈ క్రమంలో భద్రతా దళాలకు ఎదురపడిన మావోయిస్టులు కాల్పులకు తెగబడగా వారిపై భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయని అధికారులు తెలిపారు. ఎన్ కౌంటర్ ఘటనా స్థలంలో 18 మంది నక్సల్స్ మృతదేహాలతో పాటు తుపాకులు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఎదురుకాల్పులు కొనసాగు తున్నాయని, భద్రతా సిబ్బంది తిరిగి వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు చెప్పారు. మావోయిస్టుల నిర్మూలన లక్ష్యంగా చత్తీస్ గఢ్ అడవుల్లో సాగుతున్న ఆపరేషన్ కగార్ తో పచ్చని గిరిజన పల్లెలు రక్తమోడు తున్నాయి

  • Related Posts

    14 రోజుల పసికందుని బకెట్ నీళ్లలో వేసి చంపేసిన తల్లి

    14 రోజుల పసికందుని బకెట్ నీళ్లలో వేసి చంపేసిన తల్లి హైదరాబాద్ – మైలార్​దేవ్ పల్లి ఆలీ నగర్లో హృదయ విదారక ఘటన పసికందుని బకెట్ నీళ్లలో వేసి చంపి ప్రమాదవశాత్తుగా క్రియేట్ చేసిన తల్లి స్నానం చేసి వచ్చేసరికి బకెట్లో…

    భార్యను చంపి.. సూట్కేసులో పెట్టిన భర్త

    🔹భార్యను చంపి.. సూట్కేసులో పెట్టిన భర్త బెంగళూరులో ఘోరం చోటుచేసుకుంది,, మహారాష్ట్రకు చెందిన రాకేశ్ సంబేకర్ అనే వ్యక్తి తన భార్య (32) ను హత్య చేశాడు. అనంతరం సూట్కేసులో కుక్కి పరారయ్యాడు. తానే చంపానని ఆమె తల్లిదండ్రులకు నిందితుడు ఫోన్లో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మయన్మార్ అతి భారీ భూకంపం

    మయన్మార్ అతి భారీ భూకంపం

    డబ్ల్యూ జే ఐ ఉగాది పంచాంగాన్నిఆవిష్కరించిన రాష్ట్ర మంత్రులు

    డబ్ల్యూ జే ఐ ఉగాది పంచాంగాన్నిఆవిష్కరించిన రాష్ట్ర మంత్రులు

    ప్రతి ఒక్కరూ బాధ్యత గల భారత పౌరులుగా దేశాభివృద్ధిలో భాగస్వాములమవుదాం

    ప్రతి ఒక్కరూ బాధ్యత గల భారత పౌరులుగా దేశాభివృద్ధిలో భాగస్వాములమవుదాం

    డబ్ల్యూ జే ఐ ఉగాది పంచాంగాన్నిఆవిష్కరించిన రాష్ట్ర మంత్రులు

    డబ్ల్యూ జే ఐ ఉగాది పంచాంగాన్నిఆవిష్కరించిన రాష్ట్ర మంత్రులు