డబ్ల్యూ జే ఐ ఉగాది పంచాంగాన్నిఆవిష్కరించిన రాష్ట్ర మంత్రులు

డబ్ల్యూ జే ఐ ఉగాది పంచాంగాన్ని
ఆవిష్కరించిన రాష్ట్ర మంత్రులు

మనోరంజని ప్రతినిధి హైదరాబాద్ మార్చి 28 :- హైదరాబాద్: వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా ( డబ్ల్యూ జే ఐ ) రూపొందించిన శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పంచాంగం/దైనందినిని రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు శుక్రవారం ఆవిష్కరించారు. హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో డబ్ల్యూ జే ఐ ప్రతినిధులు వారిని కలిసి జర్నలిస్టుల సంక్షేమానికి యూనియన్ చేపట్ఠిన, చేపట్టనున్న కార్యక్రమాలను వివరించారు. సమస్యల పరిష్కారానికి సహకరించాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా మంత్రులు పాత్రికేయులకు, ప్రజలకు తెలుగు వత్సర శుభాభినందనలు తెలిపారు. సమస్యలపై పోరాటంలో తాము జర్నలిస్టుల వెంట కలిసి నడుస్తామని వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా జాతీయ కార్య నిర్వాహక అధ్యక్షుడు సంజయ్ ఉపాధ్యాయ, ప్రధాన కార్యదర్శి నరేంద్ర భండారి, సీనియర్ ఉపాధ్యక్షుడు సంజయ్ సక్సేనాలు తమ సందేశాల్లో పేర్కొన్నారు. తెలుగు ప్రజలకు , పాత్రికేయులకు వారు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. పంచాంగం/దైనందిని ఆవిష్కరణ కార్యక్రమంలో డబ్ల్యూ జే ఐ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు నందనం కృపాకర్, అధ్యక్షుడు రాణాప్రతాప్ రజ్జూభయ్యా , ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్, కార్యదర్శి క్రాంతి ముదిరాజ్, నగర అధ్యక్షుడు బాలకృష్ణ పాల్గొన్నారు.

  • Related Posts

    త్వరలో అంగన్‌వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్: సీతక్క

    త్వరలో అంగన్‌వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్: సీతక్క తెలంగాణలో త్వరలోనే అంగన్‌వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు. వరంగల్ లో ఏర్పాటు చేసిన మెగా జాబ్‌మేళాను మంత్రులు సీతక్క, కొండా సురేఖ ప్రారంభించారు. ఇలాంటి జాబ్‌మేళాను నిరుద్యోగులు ఉపయోగించుకోవాలని,…

    జలవిహార్‌లో మున్నూరుకాపు ప్రతినిధుల సదస్సు – ఏప్రిల్ 13న

    హైదరాబాద్‌లోని జలవిహార్‌లో ఈ నెల 13న ఆదివారం ఉదయం 11 గంటలకు మున్నూరుకాపు ప్రతినిధుల సదస్సు నిర్వహించనున్నట్లు తెలంగాణ మున్నూరుకాపు జర్నలిస్ట్ ఫోరం జిల్లా అధ్యక్షుడు గుమ్ముల అశోక్ తెలిపారు. ఈ కార్యక్రమం పార్టీలకతీతంగా జరుగుతుందని, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    త్వరలో అంగన్‌వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్: సీతక్క

    త్వరలో అంగన్‌వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్: సీతక్క

    పదేళ్ల తర్వాత పూలే గుర్తుకు – బీఆర్ఎస్‌పై గోవింద్ నాయక్ ఫైరింగ్

    పదేళ్ల తర్వాత పూలే గుర్తుకు – బీఆర్ఎస్‌పై గోవింద్ నాయక్ ఫైరింగ్

    జలవిహార్‌లో మున్నూరుకాపు ప్రతినిధుల సదస్సు – ఏప్రిల్ 13న

    జలవిహార్‌లో మున్నూరుకాపు ప్రతినిధుల సదస్సు – ఏప్రిల్ 13న

    నీరు లేని బోర్లు… మనోవేదనతో రైతు ఆత్మహత్య

    నీరు లేని బోర్లు… మనోవేదనతో రైతు ఆత్మహత్య