ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌..

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌..

22మంది మావోల హతం..

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. గురువారం ఉదయం బీజాపూర్‌-దంతెవాడ సరిహద్దులో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 22 మంది మావోలు హతమయ్యారు. ఒక జవాన్‌ కూడా ప్రాణాలు కోల్పోయినట్లు బీజాపూర్‌ పోలీసులు వెల్లడించారు.

బీజాపూర్‌ జిల్లాలో భారీగా మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో గురువారం ఉదయం 7 గంటల నుంచి భద్రతా బలగాలు నక్సల్స్‌ వ్యతిరేక ఆపరేషన్‌ చేపట్టారు. ఈ క్రమంలో బీజాపూర్‌ – దంతెవాడ జిల్లాల సరిహద్దులో ఉన్న అండ్రి అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ ఆపరేషన్‌ చేపడుతుండగా.. ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో 22 మంది మావోలు హతమయ్యారు. ఘటనాస్థలి నుంచి భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు బీజాపూర్‌ పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం అక్కడ ఆపరేషన్‌ కొనసాగుతున్నట్లు తెలిపారు

  • Related Posts

    బైకుపై మృతదేహంతో నిరసన.

    బైకుపై మృతదేహంతో నిరసన. మనోరంజని స్టేట్ ఇంచార్జ్ ఆంధ్ర ప్రదేశ్: ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం ఎర్రంపేటకు చెందిన దార్ల హేమ దుర్గా ప్రసన్నను (31) గంగన్నగూడెం గ్రామానికి చెందిన మోదుగ సాయి బలవంతంగా లోపర్చుకొని ఆమెతో ఏకాంతంగా ఉన్న వీడియోలను…

    బైక్ తో స్తంభానికి ఢీకొని వ్యక్తి గాయాలు

    బైక్ తో స్తంభానికి ఢీకొని వ్యక్తి గాయాలు మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 29 :- బైక్ తో స్తంభానికి ఢీకొని వ్యక్తి గాయపడిన ఘటన శనివారం ముధోల్ లో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం బైక్ వస్తున్న ఉరేకర్ పోతన్న…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    గ్రామపాలన అధికారుల ఎంపికకు స్క్రీనింగ్ టెస్ట్..!!

    గ్రామపాలన అధికారుల ఎంపికకు స్క్రీనింగ్ టెస్ట్..!!

    సెయింట్ థెరిస్సా హైస్కూల్ విద్యార్ధికి నవోదయ కి ఎంపిక

    సెయింట్ థెరిస్సా హైస్కూల్ విద్యార్ధికి నవోదయ కి ఎంపిక

    ఉగాది సందర్భంగా బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రసంగం

    ఉగాది సందర్భంగా బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రసంగం

    శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా బీజేపీ కార్యాలయంలో సుదర్శన హోమం

    శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా బీజేపీ కార్యాలయంలో సుదర్శన హోమం