చించోడు గ్రామపంచాయతీ ఆవరణలో సీసీ కెమెరాలను ప్రారంభించిన ఏసిపి రంగస్వామి

చించోడు గ్రామపంచాయతీ ఆవరణలో సీసీ కెమెరాలను ప్రారంభించిన ఏసిపి రంగస్వామి

మనోరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 04 : గ్రామాల్లో సిసి కెమెరాలు ఏర్పాటుతో నేరాలను నిరోధించవచ్చని షాద్ నగర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రంగస్వామి అన్నారు. ఫరూక్ నగర్ మండలం చించోడు గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణలో సీసీ కెమెరాలు ఏసీబీ రంగస్వామి సిఐ విజయ్ కుమార్ తదితరుల గ్రామ పెద్దల సమక్షంలో లంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏసిపి రంగస్వామి మాట్లాడుతూ.. గ్రామంలో కదలికలను ఎప్పటికప్పుడు పోలీసులు పరిశీలిస్తూ ఉంటారని తెలిపారు. ఏ చిన్న నేరం జరిగిన ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగిన వెంటనే స్పందించే ఆస్కారం ఉంటుందని ఎసిపి అన్నారు. ప్రజలు చైతన్యంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని స్వచ్ఛందంగా పోలీసు శాఖకు సహకారం అందించడం అభినందనీయమని వారిని కొనియాడారు. రెండు లక్షల రూపాయల వ్యయంతో 14 సీసీ కెమెరాలు ఊరు చుట్టూ మొత్తం నిఘానేత్రం ఆధీనంలో ఉంటుందని ఇది ఎంతో శుభ పరిణామం అని ఆయన పేర్కొన్నారు. ఇటీవల గ్రామంలో మద్యపాన నిషేధం గ్రామస్తులు ఏర్పాటు చేసిన సమయంలో స్థానిక విజయ్ కుమార్ ఇక్కడికి వచ్చినప్పుడు ప్రజలకు సీసీ కెమెరాలుపై అవగాహన కల్పించడం జరిగిందని గ్రామ పెద్దల సహకారంతో వెంటనే రెండు లక్షల రూపాయలతో 14 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు అజ్మత్ బాబా, అక్కిగారి శ్రీధర్,గ్రామ పెద్దలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    రూపాయి రూపాయి కూడా కట్టుకొని… బాధితుడు జెస్సు అనిల్.

    రూపాయి రూపాయి కూడా కట్టుకొని… బాధితుడు జెస్సు అనిల్. మనోరంజని చీఫ్ బ్యూరో:మార్చి 18 ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి టీచర్స్ కాలనీలో గతంలో ఉపాధ్యాయులు రూపాయి రూపాయి కూడా కట్టుకొని డబ్బులు జమచేసి లేఔట్ ఉన్నటువంటి భూమిలో ప్లాట్లను కొనుగోలు…

    తెలంగాణ వసతి గృహ సంక్షేమ అధికారి గా భీమారం మండలం శ్రీనివాస్ విజయం

    తెలంగాణ వసతి గృహ సంక్షేమ అధికారి గా భీమారం మండలం శ్రీనివాస్ విజయం మనోరంజని ప్రతినిధి భీమారం మార్చి 18 :- భీమారం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన యాసం శ్రీనివాస్ తెలంగాణ వసతి గృహ సంక్షేమ అధికారి ఉద్యోగ ఫలితాల్లో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    రూపాయి రూపాయి కూడా కట్టుకొని… బాధితుడు జెస్సు అనిల్.

    రూపాయి రూపాయి కూడా కట్టుకొని… బాధితుడు జెస్సు అనిల్.

    తెలంగాణ వసతి గృహ సంక్షేమ అధికారి గా భీమారం మండలం శ్రీనివాస్ విజయం

    తెలంగాణ వసతి గృహ సంక్షేమ అధికారి గా భీమారం మండలం శ్రీనివాస్ విజయం

    వినాయక్ నగర్ తుల్జాభవాని మాత ఆలయంలో ప్రత్యేక పూజలు

    వినాయక్ నగర్ తుల్జాభవాని మాత ఆలయంలో ప్రత్యేక పూజలు

    పోసాని కృష్ణ మురళి బెయిల్ పిటిషన్ పై వాయిదా?

    పోసాని కృష్ణ మురళి బెయిల్ పిటిషన్ పై వాయిదా?