ఖమ్మం జిల్లా బీసీ సదస్సును జయప్రదం చేయండి

ఖమ్మం జిల్లా బీసీ సదస్సును జయప్రదం చేయండి

టీబీసీ జేఏసీ టీజీ చైర్మన్ పెరుగు వెంకటరమణ యాదవ్

మనోరంజని ప్ఖరతినిధి ఖమ్మం మార్చి 07 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సామాజిక , ఆర్థిక , విద్య ఉపాధి రాజకీయ మరియు కుల సర్వేకు మద్దతుగా ఉండి బీసీలకు రావాల్సిన 42 శాతం వాటా కి చట్టబద్ధత సాధిద్దాం అనే నినాదంతో తెలంగాణ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా బీసీ సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందాని , ఈ యొక్క సదస్సును జయప్రదం చేయాలని చైర్మన్ పెరుగు వెంకటరమణ యాదవ్ స్థానిక కార్యాలయము నందు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తెలియజేశారు . ఆయన మాట్లాడుతూ బీసీలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మరియు మంత్రి వర్గానికి ధన్యవాదాలు తెలియజేశారు . విద్య , ఉద్యోగ , స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని క్యాబినెట్ ఆమోదం తెలిపినందుకు ధన్యవాదాలు తెలియజేశారు . యావత్ బీసీ సమాజం ఈరోజు ముఖ్యమంత్రి కి అండగా నిలబడి మన 42% వాటాన్ని చట్టబద్ధత సాధించటం కొరకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు . కావున ఖమ్మం జిల్లాలో ఉన్న యావత్ బీసీ సమాజం ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు . ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ చీఫ్ అడ్వైజర్ చేకూరి చైతన్య , జి నరేందర్ , దరిపల్లి వీరబాబు , వల్లెపు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు .

  • Related Posts

    ప్రభుత్వ హాస్టళ్ళలో విద్యార్థినీల ప్రతిభను వెలికితీసేందుకే యువ ఉత్సవ్

    ప్రభుత్వ హాస్టళ్ళలో విద్యార్థినీల ప్రతిభను వెలికితీసేందుకే యువ ఉత్సవ్ ఆకట్టుకున్న సైన్స్ ఎగ్జిబిషన్, ఫోటో గ్యాలరీ, సాంస్క్రతిక కార్యక్రమాలు ప్రభుత్వ హాస్టళ్ళలో ఉంటూ విద్యనభ్యసిస్తున్న విద్యార్థినీ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు నెహ్రు యువ కేంద్రం ఆధ్వర్యంలోయువ ఉత్సవ్…

    ఒత్తిడిని అధిగమించి విజయాన్ని సాధించాలి

    ఒత్తిడిని అధిగమించి విజయాన్ని సాధించాలి నిర్మల్ జిల్లా భైంసా మండలం వనాల్పడ్ గ్రామం లో స్థానిక ప్రభుత్వ వానాల్పడ్ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆనందిత ఫౌండేషన్ చైర్మన్,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బీటెక్ ఫలితాలలో శ్రీ చైతన్య ప్రభంజనం

    బీటెక్ ఫలితాలలో శ్రీ చైతన్య ప్రభంజనం

    ప్రభుత్వ హాస్టళ్ళలో విద్యార్థినీల ప్రతిభను వెలికితీసేందుకే యువ ఉత్సవ్

    ప్రభుత్వ హాస్టళ్ళలో విద్యార్థినీల ప్రతిభను వెలికితీసేందుకే యువ ఉత్సవ్

    ఒత్తిడిని అధిగమించి విజయాన్ని సాధించాలి

    ఒత్తిడిని అధిగమించి విజయాన్ని సాధించాలి